Iron Dome | అదృశ్య కవచం ఐరన్‌డోమ్.. ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలుస్తున్న ఆధునిక వ్యవస్థ
ఇజ్రాయెల్‌పై అనూహ్య దాడులకు పాల్పడిన హమాస్ మిలిటెంట్లు నిమిషాల వ్యవధిలోనే 5 వేల రాకెట్లు ప్రయోగించారు. ఇజ్రాయెల్‌లోని నగరాలే లక్ష్యంగా గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఈ దాడులకు దిగారు.
- హమాస్ రాకెట్లను ధ్వంసం చేయడంలో కీలకపాత్ర
- నిమిషాల వ్యవధిలో వేల రాకెట్లు ప్రయోగించడంతో కొంత వరకు సక్సెస్ అయిన హమాస్ మిలిటెంట్లు
Iron Dome | జెరూసలేం, అక్టోబర్ 8: ఇజ్రాయెల్‌పై అనూహ్య దాడులకు పాల్పడిన హమాస్ మిలిటెంట్లు నిమిషాల వ్యవధిలోనే 5 వేల రాకెట్లు ప్రయోగించారు. ఇజ్రాయెల్‌లోని నగరాలే లక్ష్యంగా గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఈ దాడులకు దిగారు. అయితే ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ ఈ దాడులు ఎలా జరిగాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలేంటీ ఐరన్‌డోమ్?
రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అనే ప్రభుత్వ సంస్థ 2011లో దీన్ని తయారు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా శత్రు దేశాల స్వల్ప శ్రేణి రాకెట్లు, క్షిపణులను అడ్డుకొని గాల్లోనే వాటిని తునాతునకలు చేస్తుంది. ఈ వ్యవస్థలో ఉండే బ్యాటరీలు తమ వైపు దూసుకొచ్చే రాకెట్ల వేగం, పథం (ట్రాజెక్టరీ), లక్ష్యాన్ని ముందుగానే పసిగట్టి వాటిని అడ్డుకుంటుంది. 2011లో గాజా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీర్షేవాలో దీన్ని మొదటగా పరీక్షించారు. ప్రస్తుతం ఇటువంటి బ్యాటరీలు ఇజ్రాయెల్ వద్ద మొత్తం పది ఉన్నాయి.
ఎలా పనిచేస్తుంది?
ఐరన్ డోమ్‌లో మూడు వ్యవస్థలు ఉంటాయి. రాడార్, బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపన్ కంట్రోల్ సిస్టమ్(బీఎంసీ), మిసైల్ ఫైరింగ్ యూనిట్. శత్రువులు ప్రయోగించే రాకెట్లను రాడార్ పసిగట్టి.. దాని గమనాన్ని బీఎంసీకి పంపిస్తుంది. రాకెట్ వేగం, పడే ప్రాంతాలను అంచనావేసి మిసైల్ ఫైరింగ్ యూనిట్‌కు బీఎంసీ సందేశం అందిస్తుంది. అనంతరం ఐరన్‌డోమ్ నుంచి వెలువడే టమిర్ క్షిపణులు ప్రత్యర్థుల రాకెట్లను గాల్లోనే పేల్చేస్తాయి.
ఐరన్‌డోమ్ ఎలా విఫలమైంది?
ఐరన్డోమ్లో లోపాల కోసం హమాస్ మిలిటెంట్లు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఏకకాలంలో చాలా రాకెట్లను ప్రయోగిస్తే ఐరన్‌డోమ్ అడ్డుకోదని వారు గ్రహించారు. అందుకే 20 నిమిషాల వ్యవధిలో 5000 రాకెట్లను హమాస్ ఇజ్రాయెల్‌పై గురిపెట్టింది. మరో వైపు హమాస్ తమ రాకెట్ టెక్నాలజీని గణనీయంగా అభివృద్ధి చేసుకోవడంతో వారు ఐరన్‌డోమ్ కళ్లుగప్పడంలో సఫలమయ్యారు. అయినప్పటికీ ప్రస్తుత దాడిలో 90 శాతం రాకెట్లను ఐరన్‌డోమ్ అడ్డుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

