మైక్రోసాఫ్ట్ సేవల పునరుద్ధరణ
ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో వినియోగదారులను ఇబ్బందికి గురిచేసిన మైక్రోసాఫ్ట్ సేవలను పూర్తిగా పునరుద్ధరించినట్లు సంస్థ శనివారం ప్రకటించింది.
- 74 దేశాల్లో రెండు రోజుల పాటు అంతరాయం
- సైబర్ దాడి కాదన్న సంస్థ
షికాగో, నవంబర్ 14: ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో వినియోగదారులను ఇబ్బందికి గురిచేసిన మైక్రోసాఫ్ట్ సేవలను పూర్తిగా పునరుద్ధరించినట్లు సంస్థ శనివారం ప్రకటించింది. రెండు రోజుల పాటు స్తంభించిన ఔట్ లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ 365తో పాటు ఇతర క్లౌడ్ అనుబంధ సేవలను తిరిగి ప్రారంభించినట్టు తెలిపింది. ‘ఈ ఘటనకు మూలమైన సమస్యను పరిష్కరించే చర్యలను పూర్తి చేశాం. ఇంకా ప్రభావితమైన వినియోగదారులు, ప్రాంతాలకు సేవలను పునరుద్ధరించాం’ అని మైక్రోసాఫ్ట్ ఎక్స్‌లో ఒక ప్రకటన లో తెలిపింది.
భారత్‌తో పాటు పలు దేశాల్లో దీని ప్రభావం కన్పించింది. ఆయా దేశాల్లో ఆరోగ్య సేవలు, వ్యాపారాలు, విమానయాన సంస్థలు, బ్యాంకుల సేవలపై ప్రభావం చూపింది. జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ కార్యకలాపాల్లో కొన్నింటికి గంటలపాటు ఆటంకం కలిగినట్లు తెలిపాయి. గ్రీస్, బ్రిటన్, నార్వే ప్రభుత్వాలు తమ కొన్ని కార్యకలాపాలపై ప్రభావం పడినట్లు తెలిపాయి. భారత్ లో కార్పొరేట్ రంగంతో పాటు విమానయాన సేవలపై దీని ప్రభావం పడింది. ఇండిగో విమానయాన సంస్థ పలు సర్వీసులను నిలిపివేసింది.
అమెరికాలో గురువారం మధ్యాహ్నం నుంచి సమస్యలు కనిపించడం ప్రారంభమయ్యాయి. అమెరికాలో సమస్యలు మొదలైన గంటలోనే 74 దేశాలు, భూభాగాల నుంచి డౌన్‌డిటెక్టర్‌కు అంతరాయ నివేదికలు అందాయి. ఇది సైబర్ దాడి లేదా కృత్రిమ మేధ ఏజెంట్లకు సంబంధించింది కాదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఇటీవలి నెట్వర్క్ మార్పు తర్వాత బయటపడిన, ముందుగా చేపట్టిన నెట్వర్క్ సామర్థ్య పెంపు సమయంలో ఏర్పడిన సమస్యే ఈ ఘటనకు కారణమని తెలిపింది. ఇతర కంపెనీల సాఫ్ట్‌వేర్‌తో పనిచేయడానికి కృత్రిమ మేధ వేదికలను ఎక్కువ మంది ఉపయోగిస్తున్న తరుణంలో, ఈ అంతరాయం ప్రభావం ఎంత విస్తృతంగా ఉందో ఇది తెలియజేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

