Watch: విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Tries To Open Emergency Door | గాలిలో ఎగురుతున్న విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. సిబ్బందిని కత్తితో బెదిరించి ఈ చర్యకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు అతడ్ని పట్టుకుని కొట్టారు. ఆ తర్వాత తాళ్లతో కట్టేశారు.
పనామా సిటీ: గాలిలో ఎగురుతున్న విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. (Man Tries To Open Emergency Door) సిబ్బందిని కత్తితో బెదిరించి ఈ చర్యకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు అతడ్ని పట్టుకుని కొట్టారు. ఆ తర్వాత తాళ్లతో కట్టేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నవంబర్ 5న కోపా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బ్రెజిల్ రాజధాని బ్రెసిలియా నుంచి పనామా రాజధాని పనామా సిటీకి బయలుదేరింది. ఆ విమానం పనామా సిటీ చేరుతుండగా ఒక ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. ఎయిర్ హోస్టెస్ వద్ద ఉన్న ప్లాస్టిక్ కత్తిని తీసుకుని ఆమెను బంధీగా చేసుకునేందుకు ప్రయత్నించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిని తోసి ఎమర్జెన్సీ డోర్ వద్దకు వెళ్లాడు. దానిని తెరిచేందుకు ప్రయత్నించాడు.
కాగా, విమాన సిబ్బంది కేకలు విన్న పలువురు ప్రయాణికులు వెంటనే స్పందించారు. కొందరు వ్యక్తులు గుంపుగా అతడి వద్దకు వెళ్లారు. ఆ వ్యక్తిని పట్టుకుని కొట్టారు. ఇంతలో సిబ్బంది తాళ్లతో అతడి చేతులు కట్టేశారు. పనామా సిటీ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండైన తర్వాత ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. దీంతో సిబ్బంది, ప్రయాణికుల సాహసాన్ని కోపా ఎయిర్‌లైన్స్ ప్రశంసించింది. కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్స్‌లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
VÍDEO — Passageiro tenta abrir porta de avião em voo Brasília–Panamá; Caso aconteceu na manhã da terça-feira (5), minutos antes de aeronave pousar na Cidade do Panamá. Passageiro foi detido pelas autoridades. pic.twitter.com/gDTyB5fwg3
— Nelson Carlos dos Santos Belchior (@NelsonCarlosd15) November 5, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Beat
- Emergency door
- flight
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

