బిల్డింగ్ పైనుంచి దూకిన కుక్క.. కాపాడిన వ్యక్తి

లండన్: బిల్డింగ్ పైనుంచి దూకిన ఒక కుక్కను కిందపడకుండా పట్టుకుని ఒక వ్యక్తి కాపాడాడు. బ్రిటన్‌లోని స్టాఫోర్డ్షైర్లో ఈ ఘటన జరిగింది. జాక్ రస్సెల్ అనే పేరున్న ఒక కుక్క దారి తప్పి ఆదివారం కింగ్స్విన్ఫోర్డ్లోని మౌంట్ ప్లెసెంట్ పబ్‌లోకి ప్రవేశించింది. గమనించిన నిర్వాహకులు దాని యజమానిని గుర్తించే లోపు పబ్ బిల్డింగ్ పై అంతస్తులో ఉంచారు.
అయితే తెరిచి ఉంచిన ఒక కిటికీ నుంచి తప్పించుకునేందుకు కుక్క ప్రయత్నించింది. కిటికీ నుంచి రూఫ్‌పైకి దూకింది. అదుపు తప్పి కింద పడిపోతుండగా బార్ గార్డెన్లో ఉన్న పబ్ టీమ్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఆడమ్ రావెన్హాల్ గమనించాడు. వెంటనే ఆలస్యం చేయకుండా కుక్క పడబోయే చోటకు వచ్చి దానిని చేతులతో పట్టుకున్నాడు. కిందకు దించగా అది ఆ షాక్ నుంచి తేరుకుని పారిపోయింది.
అయితే తాను పట్టుకోకపోతే ఆ చిన్న కుక్క కిందపడి ప్రాణాలు కోల్పోయి ఉండేదని ఆడమ్ చెప్పాడు. కాగా, అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుక్కను కాపాడిన ఆడమ్‌ను నెటిజన్లు ప్రశంసించారు.
https://www.facebook.com/watch/?v=3906141852830788
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

