చిప్స్ ప్యాకెట్లో.. చిప్స్‌కు బదులు ఏమున్నదంటే?

లండన్: ఒక వ్యక్తి చిప్స్ ప్యాకెట్ కొని తెరిచి చూడగా అందులో చిప్స్‌కు బదులు ఒక ఆలుగడ్డ ఉన్నది. దీంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ ఘటన బ్రిటన్‌లో జరిగింది. లింకన్షైర్లోని ఉప్పింగ్‌హామ్ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడైన డేవిడ్ బాయ్స్ ఈ నెల 17న కెటిల్ చిప్స్ ప్యాకెట్ కొన్నారు. దానిని తెరిచి చూడగా అందులో ఒక బంగాళదుంప మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో దీనిని ఫొటో తీసి ట్విట్టర్ ద్వారా ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. ‘నేను ఈ రోజు కెటిల్ చిప్స్ ప్యాకెట్ తెరిచాను. అందులో క్రిప్స్ కనిపించలేదు. ఒక బంగాళాదుంప ఉన్నది’ అని అందులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆ సంస్థ క్షమాపణలు చెప్పింది. ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలియదని పేర్కొంది. ఆ ప్యాకెట్‌ను తమకు అందజేస్తే తమ బృందం నుంచి వివరాలు సేకరిస్తామని తెలిపింది.
మరోవైపు దీనిపై నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు. చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసిన ఆయన ఆలుగడ్డను బహుమతిగా పొందారంటూ ఒకరు చమత్కరించారు. ‘నేను దీనిని జీవిత కాల ట్రోఫీగా స్వీకరించాలని అనుకుంటున్నాను. నా జీవితంలో ఎన్నడూ ట్రోఫీని సాధించలేదు. అందుకే ఈ బంగాళాదుంపలో ఎల్లప్పుడూ నా పేరు ఉంటుందని నేను భావిస్తున్నాను’ అంటూ డేవిడ్ బదులిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

