UK PM Boris Johnson | బ్రిటన్‌లో బోరిస్ జాన్సన్‌కు బుల్డోజర్ సెగ.. విపక్ష ఎంపీల ధ్వజం
UK PM Boris Johnson | ఇటీవల గుజరాత్లో బుల్డోజర్పైకెక్కిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై బ్రిటన్‌లో ఇద్దరు ఎంపీలు ధ్వజమెత్తారు.
UK PM Boris Johnson | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు స్వదేశంలో విపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఇటీవల భారత్‌లో పర్యటించిన బోరిస్ జాన్సన్.. గుజరాత్ రాష్ట్రంలో ఓ జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అటుపై అక్కడ ఉన్న బుల్డోజర్ మీదకెక్కి అభివాదం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో మత ఘర్షణల నేపథ్యంలో పలు ఇండ్లు, దుకాణాలను బుల్డోజర్లతో ధ్వంసం చేయడం వివాదాస్పదమైంది. ఈ తరుణంలోనే బోరిస్ జాన్సన్ ప్రవర్తనను బ్రిటన్ ఎంపీలు కూడా తప్పుబట్టారు.
విపక్ష లేబర్ పార్టీ ఎంపీ జారా సుల్తానా మాట్లాడుతూ.. భారత్ పర్యటనలో ఒక వర్గానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ప్రధాని మోదీని ప్రశ్నించడంలో బోరిస్ జాన్సన్ విఫలమయ్యారని విమర్శించారు. దీనికి బదులుగా జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించార్నారు. దీంతో మానవ హక్కులపై జాన్సన్‌కు ఎంత శ్రద్ధ ఉందో అర్థం అవుతుందన్నారు.
మరో ఎంపీ నాదియా విటోమ్ స్పందిస్తూ.. ‘బోరిస్ జాన్సన్ ఇటీవల భారత పర్యటనలో జేసీబీల పక్కన నిలబడి ఫోజులు ఇచ్చారు. కానీ భారత్ ప్రధాని మోదీతో ఇండ్ల కూల్చివేతలపై ప్రశ్నలు లేవనెత్తారో లేదో చెప్పలేదు’ అని అన్నారు. మోదీ ప్రభుత్వ చర్యలకు చట్టబద్ధత కల్పించేందుకు తన భారత పర్యటన దోహదపడిందని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

