200 మంది మోడళ్లు నగ్నంగా.. ఫోటో షూట్‌కు ఫోజులు

అరద్: ఇజ్రాయిల్‌లో సుమారు 200 మంది మోడళ్లు .. నగ్నంగా ఫోటో షూట్లో పాల్గొన్నారు. డెడ్ సీ వద్ద ఉన్న ఎడారిలో వాళ్లంతా ఫోటో షూట్ చేశారు. అమెరికన్ ఆర్టిస్ట్ స్పెన్సర్ టునిక్ ఈ ఫోటోలను తీశారు. మోడళ్లు అందరూ శరీరానికి తెల్ల రంగు వేసుకుని ఫోటో షూట్లో పాల్గొన్నారు. ఇజ్రాయిల్‌లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. అయితే డెడ్ సీ వద్ద జల సంపద తరిగిపోతోంది. ఆ సమస్యపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో న్యూడ్ ఫోటో షూట్‌ను ఆర్గనైజ్ చేశారు. 54 ఏళ్ల ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ ఆదేశాలకు తగినట్లు మోడళ్లు ముందుకు కదిలారు. ఇజ్రాయిల్ పర్యాటక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫోటోగ్రాఫర్ ట్యూనిక్ గతంలో ఓ సారి వెయ్యి మంది మోడళ్లతో ఉప్పునీటి సముద్రమైన డెడ్ సీ వద్ద న్యూడ్ ఫోటోలు తీసారు. ప్రతి ఏడాది డెడ్ సీ సుమారు ఓ మీటరు మేర ఎండిపోతున్నది. ఇజ్రాయిల్, జోర్డాన్లు ఎగువ ప్రాంతంలో నీటి మళ్లించడంతో డెడ్ సీ ఎండిపోవాల్సి వస్తోంది. దీనికి తోడు మైనింగ్ కూడా సమస్యగా మారింది. మోడళ్లకు వైట్ పేయింట్ వేయడానికి ట్యునిక్ ఓ కారణం చెప్పాడు. బైబిల్లోని కథ ప్రకారం.. లాట్ అనే వ్యక్తి భార్య ఉప్పు స్తంభంగా మారిపోతుందని, ఆ ఘటనను దృష్టిలో పెట్టుకుని మోడళ్లకు తెలుపు రంగు వేసినట్లు టునిక్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

