పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువెల్ మాక్రన్‌కు చేదు అనుభవం ఎదురైంది. లియన్ సిటీలో జరుగుతున్న అంతర్జాతీయ ఆహార వాణిజ్య ఫెయిర్‌కు వెళ్లిన ఆయనపై ఓ వ్యక్తి గుడ్డుతో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అయ్యింది. జనం మధ్య నడుచుకుంటూ వెళ్తున్న మాక్రన్పై ఓ వ్యక్తి గుడ్డు విసిరాడు. అయితే ఆ గుడ్డు పగులకుండానే బౌన్స్ అయ్యింది. ఆ వెంటనే ఇద్దరు బాడీగార్డులు అధ్యక్షుడికి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. గుడ్డు విసిరిన వ్యక్తిని ఇద్దరు బాడీగార్డులు పక్కకు తీసుకువెళ్లారు. ఏమైనా చెప్పాలనుకుంటే, అతను తన వద్దకు రావచ్చు అని ఆ సమయంలో మాక్రన్ అన్నారు. ఆ వ్యక్తి ఎందుకు గుడ్డుతో దాడి చేశాడో ఇంకా స్పష్టం కాలేదు. గతంలో ఓ సారి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి మాక్రన్ చెంపపై కొట్టారు.