Viral Video: పిల్లిని కాపాడిన అమెరికా జెండా.. ఎలాగంటే?

వాషింగ్టన్: ఒక పిల్లి ప్రమాదవశాత్తూ జారిపడి ఫుట్‌బాట్ స్టేడియంపైనున్న ఒక వైర్‌పై ముందరి కాళ్లతో చాలాసేపు వేలాడింది. గమనించిన ప్రేక్షకులు చాలా ఉత్కంఠకు లోనయ్యారు. చివరకు ఆ పిల్లి కిందకు పడిపోతుండగా అమెరికా జెండాను వలగా పట్టుకుని కాపాడారు. అమెరికాలోని మియామి నగరంలో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి అక్కడి హార్డ్ రాక్ స్టేడియంలో మియామి హరికేన్స్ , అప్పలాచియన్ స్టేట్ గేమ్ మధ్య కాలేజీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. క్రీడాభిమానులు చాలా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇంతలో ఉన్నట్టుడి, నలుపు, తెలుపు రంగులో ఉన్న ఒక పిల్లి పైనున్న గ్యాలరీ వైర్‌ను ముందరి కాళ్లతో పట్టుకుని వేలాడింది. దీనిని చూసిన స్టేడియంలోని వారు ఉత్కంఠకు గురయ్యారు. ఆ పిల్లిని కాపాడేందుకు కొందరు ప్రయత్నించారు. కొంత సేపటి తర్వాత ఒక కాలి పట్టుతో వేలాడిన ఆ పిల్లి చివరకు పైనుంచి కింద పడింది. అయితే గ్రౌండ్ గ్యాలరీలోని వీక్షకుల్లో కొందరు అమెరికా జెండాను వలగా పట్టుకున్నారు. ఆ పిల్లి అందులో పడటంతో దానికి ఎలాంటి గాయం కాలేదు. స్టేడియం సెక్యూరిటీ సిబ్బంది ఆ పిల్లిని సురక్షితంగా స్టేడియం బయట వదిలేశారు.
కాగా, ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన వారిలో కొందరు తమ మొబైల్స్‌లో దీనిని వీడియో తీయగా సోషల్ మీడియాలో అవి వైరల్ అయ్యాయి.
Well this may be the craziest thing I’ve seen at a college football game #HardRockCat pic.twitter.com/qfQgma23Xm
— Hollywood (@DannyWQAM) September 11, 2021
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

