అమెరికాలో మరో వైరస్ కలకలం.. ఏంటది? ఎందుకంత ప్రమాదం !
న్యూయార్క్: అమెరికాలో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు అయ్యింది. ఆ దేశ అంటువ్యాధుల సంస్థ సీడీసీ ఈ కేసును ద్రువీకరించింది. మాసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ వ్యక్తి ఇటీవల కెనడాలో పర్యటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో చేర్పించారు. కెనడాలోని క్యూబెక్ ప్రావిన్సులో డజన్ల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. మంకీపాక్స్‌ను సీరియస్ వైరస్ కేసుగా భావిస్తున్నారు. ఫ్లూ లాంటి లక్షణాలతో అస్వస్థత ప్రారంభం అవుతుంది. జ్వరం, వళ్లు నొప్పులు, శరీరంపై అమ్మవారు మచ్చలు వ్యాపిస్తాయి.
కెనడాలోని మాంట్రియల్లో ఆరోగ్యశాఖ అధికారులు 13 మంకీపాక్స్ కేసులను విచారిస్తున్నారు. శరీర ద్రవాలు కలవడం వల్ల మంకీపాక్స్ సోకే ప్రమాదం ఉంది. వ్యాధి సోకిన వ్యక్తి శరీరాన్ని తాకినా ఇది వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి దుస్తులు వేసుకున్నాఆ వైరస్ ప్రబలే ఛాన్సు ఉంది. ఇటీవల యురోప్లోనూ మంకీపాక్స్ కేసులు ఎక్కువయ్యాయి. పోర్చుగల్, స్పెయిన్, బ్రిటన్‌లో ఈ కేసుల్ని ఎక్కువగా గుర్తించారు. ఈ వ్యాధి ఎక్కువగా సెక్స్ వర్కర్ల ద్వారా వ్యాపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

