హెల్సింకి: ఫిన్‌ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్ డ్రగ్ పరీక్ష చేయించుకున్నారు. ఇటీవల ఓ పార్టీలో ఆమె డ్యాన్స్ చేసిన వీడియోను వైరల్ కావడంతో ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ప్రధాని మారిన్ డ్రగ్స్ తీసుకుని చిందులు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తానేమీ డ్రగ్స్ తీసుకోలేదని ఫిన్‌ల్యాండ్ ప్రధాని తెలిపారు. 2019 డిసెంబర్లో ప్రపంచంలోనే యువ ప్రధానిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే పార్టీ వీడియోలు లీక్ కావడంతో.. కూటమి పార్టీలతో పాటు ప్రతిపక్షాలు పార్టీలు డ్రగ్ టెస్టుకు డిమాండ్ చేశాయి.