నాటో సభ్యత్వాన్ని తీసుకోనున్న ఫిన్‌ల్యాండ్..
హెల్సింకీ: నాటో దళంలో ఫిన్‌ల్యాండ్ చేరనున్నది. ఈ నేపథ్యంలో ఆ దేశం సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోనున్నది. ఫిన్‌ల్యాండ్ ప్రెసిడెంట్ సౌలీ నీనిస్టో, ప్రధాని సన్నా మారిన్ దీనిపై సంయుక్త ప్రకటన చేశారు. ఎటువంటి ఆలస్యం లేకుండా నాటో సభ్యత్వం కోసం ఫిన్‌ల్యాండ్ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ చేపట్టిన నేపథ్యంలో ఫిన్‌ల్యాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఫిన్‌ల్యాండ్, రష్యా మద్య 1300 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. గతంలో ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. నాటో బృందంలో స్వీడెన్ కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫిన్‌ల్యాండ్, స్వీడెన్ తీసుకున్న నిర్ణయాలను రష్యా తప్పుపడుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

