UK Court | కోర్టులో విచారణ.. జడ్జి చూస్తుండగానే నిందితుడు పరార్.. Video viral
UK Court | ఓ కేసుకు సంబంధించి కోర్టు (Court) లో విచారణ జరుగుతుండగానే పోలీసులు (Police), జడ్జి (Judge) కళ్ల ముందు నుంచే నిందితుడు పరారయ్యాడు. ఈ అనూహ్య ఘటన యూకే (United Kingdom) లోని క్రోడాన్ క్రౌన్ కోర్టు (Croydon Crown Court) లో చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో నిందితుడు న్యాయస్థానం నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.
UK Court : ఓ కేసుకు సంబంధించి కోర్టు (Court) లో విచారణ జరుగుతుండగానే పోలీసులు (Police), జడ్జి (Judge) కళ్ల ముందు నుంచే నిందితుడు పరారయ్యాడు. ఈ అనూహ్య ఘటన యూకే (United Kingdom) లోని క్రోడాన్ క్రౌన్ కోర్టు (Croydon Crown Court) లో చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో నిందితుడు న్యాయస్థానం నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారాయి.
యూకే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మత్తు పదార్థాలకు బానిసైన 26 ఏళ్ల అబు ఫాయే (Abu Faye) ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై దాదాపు పది కేసులు నమోదయ్యాయి. మాదకద్రవ్యాలను కలిగి ఉండటమే గాక.. డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కేసుల్లో ఇటీవల అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తాను మత్తు పదార్థాలు తీసుకుంటున్నట్లు నిందితుడు కోర్టు ముందు అంగీకరించాడు. దాంతో అతడిని పోలీసుల కస్టడీకి అప్పగించాలని జడ్జి నిర్ణయించారు.
ఈ క్రమంలోనే నిందితుడు భయంతో హఠాత్తుగా కోర్టు తలుపులు తెరుచుకొని పరారయ్యాడు. దాంతో పోలీసులతోపాటు అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. నిందితుడిని పట్టుకునేందుకు కోర్టు వద్ద భద్రతాసిబ్బంది ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దాంతో పోలీసులు అతడి కోసం ముమ్మర గాలింపుచర్యలు చేపట్టారు. తూర్పు లండన్‌లోని హాక్నీ ప్రాంతానికి చెందిన అబు ఫాయేకి కేంబ్రిడ్జి, పెంగే ప్రాంతాలతో సంబంధాలున్నాయి. దాంతో అతడు అక్కడే నక్కి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడిని గుర్తిస్తే ప్రజలు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కోరారు. కాగా కోర్టు నుంచే నిందితుడు పారిపోవడం భద్రతా లోపమని విమర్శలు వస్తున్నాయి.
Abu Faye wanted after absconding from court in Croydon. https://t.co/zY1x7lvp0u pic.twitter.com/lZDid8pt9b
— Tower Hamlets Crime Watch (@th_crime_watch) March 30, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

