Google Chrome | గూగుల్ ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టండి.. కోర్టుకు అమెరికా న్యాయశాఖ కీలక ప్రతిపాదనలు
ఇంటర్నెట్ ప్రపంచంలో గూగుల్ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలకాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలతో కూడిన 23 పేజీల డాక్యుమెంట్‌ను యూఎస్ న్యాయశాఖ తయారుచేసింది.
- క్రోమ్‌ను అమ్మేసేలా ఆదేశించండి
- ఆండ్రాయిడ్పైనా ఆంక్షలు విధించండి
- ఏప్రిల్‌లో కేసును విచారించనున్న న్యాయమూర్తి అమిత్ మెహతా
Google Chrome | వాషింగ్టన్: ఇంటర్నెట్ ప్రపంచంలో గూగుల్ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలకాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలతో కూడిన 23 పేజీల డాక్యుమెంట్‌ను యూఎస్ న్యాయశాఖ తయారుచేసింది. వాషింగ్టన్ డీసీ కోర్టులో ఈ పత్రాన్ని బుధవారం దాఖలు చేసింది. గూగుల్‌ది ఏకఛత్రాధిపత్యం అని ఆగస్టులో వాషింగ్టన్ డీసీ కోర్టు న్యాయమూర్తి అమిత్ మెహతా పేర్కొన్నారు. దీంతో గూగుల్‌పై చర్యలు తీసుకోవాలని జో బైడెన్ ప్రభుత్వం భావిస్తున్నది.
ఏప్రిల్‌లో ఈ కేసు విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో గూగుల్‌పై తీసుకోవాల్సిన చర్యలను కోర్టుకు ప్రతిపాదించింది. గూగుల్‌కు చెందిన క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ను విక్రయించేలా ఆదేశాలు ఇవ్వాలని, సొంత సెర్చ్ ఇంజిన్‌కు మేలు చేయకుండా ఆండ్రాయిడ్‌పై ఆంక్షలు విధించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయిస్తే కీలకమైన సెర్చ్ యాక్సెస్ పాయింట్‌పై గూగుల్ నియంత్రణ శాశ్వతంగా ఆగిపోతుందని, ప్రత్యర్థి సెర్చ్ ఇంజిన్లకు క్రోమ్‌లో స్థానం లభిస్తుందని న్యాయశాఖ లాయర్లు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ఈ కేసులో సెప్టెంబర్ 1న ‘లేబర్ డే’ లోపు న్యాయమూర్తి తీర్పు ఇవ్వనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

