Covid Origins: వుహాన్ ల్యాబ్‌లో కోవిడ్ ఆనవాళ్లు లేవు : అమెరికా ఇంటెలిజెన్స్
Covid Origins: కోవిడ్ ఎక్కడ పుట్టిందో ఇంకా క్లారిటీ రాలేదు. చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో ఆ వైరస్‌కు చెందిన ఆధారాలు దొరకలేదని అమెరికా ఇంటెలిజెన్స్ తాజాగా ఓ నివేదికను రిలీజ్ చేసింది. దీంతో వైరస్ పుట్టుక ఇంకా రహస్యంగానే మిగిలిపోయింది. వుహాన్ ల్యాబ్‌లో సమగ్ర స్థాయిలో దర్యాప్తు జరిగినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్నది.
న్యూయార్క్: కోవిడ్19 ఆనవాళ్ల(Covid Origins)కు చెందిన కొత్త రిపోర్టును అమెరికా ఇంటెలిజెన్స్ రిలీజ్ చేసింది. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి ఆ వైరస్ పాకినట్లు ఆధారాలు దొరకలేదని ఆ నివేదికలో తెలిపారు. మొత్తం నాలుగు పేజీల రిపోర్టును నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసు డైరెక్టర్ శుక్రవారం రిలీజ్ చేశారు. ల్యాబ్ నుంచి కోవిడ్ వైరస్ వ్యాప్తి అయిందన్న వాస్తవాలను కొట్టిపారేయలేమని, కానీ ఆ వైరస్ ఆనవాళ్లను మాత్రం గుర్తించలేకపోయినట్లు రిపోర్టులో తెలిపారు.
సీఐఏ కానీ ఇతర ఏజెన్సీలు కానీ.. కోవిడ్ పుట్టుక గురించి పూర్తి వివరాలను సేకరించలేకపోయినట్లు ఓడీఎన్ఐ తెలిపింది. వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్లో సమగ్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు రిపోర్టులో వెల్లడించారు. కానీ మహమ్మారికి చెందిన ఆధారాలు ఏవీ చిక్కలేదన్నారు. సార్స్ సీవోవీ-2 వైరస్‌కు చెందిన ఆనవాళ్లు ఏమీ లేనట్లు తెలిపారు.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన తర్వాత ఆ వైరస్ పుట్టుక చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అమెరికాతో పాటు ఎన్నో దేశాలు ఆ వైరస్ జాడ గురించి ఆరా తీస్తూనే ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

