చైనా ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం.. టిబెట్ విమానంలో చెలరేగిన మంటలు
Tibet Airlines | చైనాలోని చాంగ్కింగ్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు (Tibet Airlines) చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. అయితే విమానంలో ఉన్నవారు క్షేమంగా బయటపడటంతో
బీజింగ్: చైనాలోని చాంగ్కింగ్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు (Tibet Airlines) చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. అయితే విమానంలో ఉన్నవారు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం చైనాలోని చాంగ్కింగ్ నుంచి టిబెట్‌లోని న్యింగ్చికి వెళ్తున్నది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో చాంగ్కింగ్ ఎర్‌పోర్టులో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సిబ్బంది విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో వెంటనే ల్యాండ్ చేశారు.

అయితే ల్యాండింగ్ అవుతుండగా అది రన్‌వేదాటి వెళ్లిపోయింది. ఈ క్రమంలో విమానం రెక్కలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బంది.. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని అత్యవసర ద్వారం నుంచి కిందికి దించివేశారు. ప్రమాద సమయంలో ఆ విమానంలో 113 ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. వారంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామని వెల్లడించారు. కాగా, రన్‌వేపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపటివరకు విమాన రాకపోకలను నిలిపివేశారు.
https://twitter.com/baoshitie1/status/1524578661386506240?s=20&t=3dZwicjWxS7oCElRB8rUgg
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

