టొరంటో: అమెరికాతో వాణిజ్య చర్చలను కెనడా నిలిపివేసింది. ఈ మేరకు కెనడా ప్రధాని(Canada PM) మార్క్ కార్నే ఓ ప్రకటన చేశారు. అమెరికా చేసిన వాణిజ్య ప్రతిపాదనలు ఆమోదయోగ్యం లేవని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ప్రతిపాదనలు అనైతికంగా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల అమెరికాతో జరిగిన చర్చల ఆధారంగా వాణిజ్యం కొనసాగించాలని భావించాం, కానీ తమ లక్ష్యాలకు తగినట్లు ఆ చర్చలు జరగలేదని, అందుకే అమెరికాతో వాణిజ్య చర్చలను నిలిపివేసినట్లు కార్నే తెలిపారు. సుమారు 28 బిలియన్ల డాలర్లకు చెందిన కెనడా వస్తువులపై 50 శాతం టారిఫ్ విధించాలని అమెరికా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదనలను కెనడా వ్యతిరేకిస్తున్నది.
అమెరికా విధిస్తున్న పన్నులకు తగిన రీతిలోనూ తాము కూడా విధించనున్నట్లు కార్నే తెలిపారు. అమెరికా చేసిన వాణిజ్య ప్రతిపాదనలు ఆశాజనకంగా లేవని, దీంతో తమ దేశ అధికారులను తిరిగి ఒట్టావా వచ్చేయమని చెప్పినట్లు కార్నే వెల్లడించారు. దేశీయంగా వాణిజ్యాన్ని బలోపేతం చేసి అమెరికాపై ఆధారపడే అవసరాన్ని తగ్గించనున్నట్లు కార్నే చెప్పారు. కెనడా వర్కర్లు, వ్యాపారవేత్తలకు సపోర్టు ఇచ్చేందుకు ప్రభుత్వం అదనపు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. వాణిజ్య చర్చల్లో కెనడా విఫలమైనట్లు అమెరికా ట్రేడ్ ప్రతినిధి జేమీసన్ గ్రీన్ తెలిపారు. ముందుగా అంగీకరించినట్లు ట్రేడ్ డీల్‌పై కెనడా ఆమోదించడం లేదని ఆయన అన్నారు.
My statement on Canada-U.S. trade negotiations: pic.twitter.com/65OuQH40ra
— Mark Carney (@MarkJCarney) August 22, 2026