మళ్లీ మెలిండానే పెళ్లి చేసుకుంటా: బిల్ గేట్స్
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇటీవల మాజీ భార్య మెలిడా ఫ్రెంచ్ గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే గేట్స్ ఫౌండేషన్ కోసం మాత్రం ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సండే టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. అవసరమైతే తాను మళ్లీ మెలిండాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్న సంకేతాలు ఇచ్చారు. మెలిండాతో వైవాహిక బంధం అద్భుతంగా సాగిందని, ఒకవేళ మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే, మెలిండాను చేసుకోవడంలో సమస్య లేదన్నారు. 2021 మే నెలలో బిల్, మెలిండాలు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2021 ఆగస్టులో వారికి డైవర్స్ కన్ఫర్మ్ అయ్యింది.
గడిచిన రెండేళ్లు చాలా నాటకీయంగా సాగినట్లు బిల్ గేట్స్ తెలిపారు. విడాకులు, కరోనా కన్నా.. పిల్లలు తనను వదిలి వెళ్లడం బాధ కలిగించినట్లు బిల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మెలిండాతో బిల్ వర్కింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఫౌండేషన్‌కు పనిచేస్తున్న ఇద్దరూ మీటింగ్ సమయంలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంటర్వ్యూలో మ్యారేజీపై బిల్ గేట్స్ కొన్ని కామెంట్స్ చేశారు. ప్రతి మ్యారేజ్లోనూ మార్పు ఉంటుందన్నారు. పిల్లలు పెరిగిన తర్వాత ఫ్యామిలీని వదిలేస్తామని, తనకు జరిగిన మార్పు విడాకులు తీసుకోవడమే అని బిల్ తెలిపారు. మెలిండాతో బంధం తెగినా.. తమ వైవాహిక జీవితం అద్భుతంగా సాగిందన్నారు.
ఒకవేళ మళ్లీ మెలిండా గేట్స్‌ను పెళ్లి చేసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అవును, మెలిండా మళ్లీ చేసుకుంటారా అని మీరు అడుగుతున్నారు కదా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే తనకు ప్రస్తుతం ఎటువంటి ప్రణాళికలు లేవన్నారు. కానీ కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. మాజీ భార్యతో ఇంకా కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు గేట్స్ తెలిపారు. ఫౌండేషన్ వార్షిక సమావేశాలను ఇద్దరం కలిసి నిర్వహిస్తున్నామన్నారు. తన మాజీ భార్యతో ఇంకా స్నేహం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తమ మధ్య సంక్లిష్టమైన సన్నిహత రిలేషన్ ఉందన్నారు. ఇద్దరం కలిసి ఫౌండేషన్ స్టార్ట్ చేశామని, ఇద్దరం కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.
వివాహాలు చాలా సంక్లిష్టమైనవని, వాటి గురించి లోతుగా చర్చించడం సరికాదు అని, కానీ విడాకుల నుంచి ఇద్దరూ కోలుకుంటున్నట్లు బిల్ గేట్స్ తెలిపారు. బిల్ గేట్స్, మెలిండా జంటకు జెన్నిఫర్, రోరీ, ఫోబో అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

