తటస్థంగా ఉంటారా…. మీకు కోవిడ్ వ్యాక్సిన్లు పంపం.. బంగ్లాకు ఝలక్
ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు రష్యా వైపు ఉంటే.. మరికొన్ని దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్నాయి. మరికొన్ని తటస్థంగానే వుండిపోతున్నాయి. కానీ.. బంగ్లాదేశ్‌ది విచిత్ర పరిస్థితి. రష్యాను విమర్శించని కారణంగా బంగ్లాదేశ్‌కు కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోయింది. న్యూస్‌వీక్ అనే సంస్థ ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ.. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగింది.
ఉక్రెయిన్‌కు మద్దతుగా 141 దేశాలు ఓటు వేయగా, 5 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 35 దేశాలు తటస్థంగా నిలిచాయి. ఈ తటస్థ దేశాల్లో బంగ్లాదేశ్ కూడా ఉంది. ఈ నిర్ణయం వల్లే బంగ్లా చిక్కుల్లో పడింది. బంగ్లా తీసుకున్న ఈ నిర్ణయం వల్లే తాము కోవిడ్ డోసులను పంపడం మానుకున్నామని లిథివేనియా ప్రకటించింది. బంగ్లా- లుథివేనియా ఒప్పందం ప్రకారం 4.4 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపాలని లిథువేనియా నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని లిథువేనియా ప్రధాని ఇంగ్రిడా సిమోనీటీ తరపు ప్రతినిధి దీనిని ధ్రువీకరించారు కూడా.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

