ఎయిర్ హోస్టెస్‌పై మస్క్ లైంగిక వేధింపులు : రూ 1.5 కోట్లు చెల్లించి నోరు మూయించారు!
స్పేస్ ఎక్స్, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ 2016లో విమానంలో వెళుతూ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించిన ఎయిర్ హోస్టెస్‌కు దాదాపు రూ . 1.5 కోట్లు చెల్లించి నోరు మూయించారని వార్తలు వచ్చాయి. ఎలన్ మస్క్ అభ్యంతరకరంగా వ్యవహరించాడని ఆరోపణలు చేసిన ఎయిర్ హోస్టెస్‌కు 2018లో భారీ మొత్తం చెల్లించి స్పేస్ ఎక్స్ ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసింది.
న్యూఢిల్లీ : స్పేస్ ఎక్స్, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ 2016లో విమానంలో వెళుతూ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించిన ఎయిర్ హోస్టెస్‌కు దాదాపు రూ . 1.5 కోట్లు చెల్లించి నోరు మూయించారని వార్తలు వచ్చాయి. ఎలన్ మస్క్ అభ్యంతరకరంగా వ్యవహరించాడని ఆరోపణలు చేసిన ఎయిర్ హోస్టెస్‌కు 2018లో భారీ మొత్తం చెల్లించి స్పేస్ ఎక్స్ ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసింది.
స్పేస్ ఎక్స్ కార్పొరేట్ జెట్ విమానాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా పని చేసే మహిళ మస్క్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు దుమారం రేపాయి. ఎయిర్ హోస్టెస్ కాలును మస్క్ ఆమె సమ్మతి లేకుండా తాకడం సహా ఆమె పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించాడని బిజినెస్ ఇన్సైడర్ పేర్కొంది. ఆమెకు గుర్రం లేదా ఎరోటిక్ మసాజర్ కొనిస్తానని ఆఫర్ చేశాడని తెలిపింది. ఫ్లైట్ అటెండెంట్ ఫ్రెండ్ బాధితురాలి వాదనకు మద్దతుగా వెల్లడించిన డిక్లరేషన్‌లో ఈ వివరాలు పొందుపరిచారు.
2016లో గల్ఫ్‌స్ట్రీమ్ జీ650ఈఆర్‌లో మస్క్ ప్రయాణిస్తుండగా ఆయన తన ప్రైవేట్ రూంకు పిలిచి ఫుల్ బాడీ మసాజ్ చేయాలని కోరినట్టు బాధిత మహిళ వెల్లడించింది. తాను మస్క్ రూంకు వెళ్లగా ఆయన నగ్నంగా మారి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తాను చెప్పినట్టు చేస్తే తనకు గుర్రాన్ని కొనిస్తానని ఆఫర్ చేశాడని పేర్కొంది. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపుల గురించి మస్క్‌ను ప్రశ్నించగా ఈ కథనం రాజకీయ దురద్దేశంతో కూడినదని తోసిపుచ్చాడు. తాను లైంగిక వేధింపులకు పాల్పడితే తన 30 ఏండ్ల కెరీర్లో ఇలాంటి ఆరోపణలు తొలిసారిగా వెలుగు చూసేవి కాదని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- air hostess
- misconduct
- musk
- tesla
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

