Turkey Earthquake | నిద్రలోనే శాశ్వత నిద్రలోకి 15 ఏండ్ల బాలిక.. శిథిలాల్లోంచి కనిపిస్తున్న చేయి పట్టుకుని తల్లడిల్లిన తండ్రి
Turkey Earthquake | భవనాలు కుప్పకూలడంతో నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. అలా మంచంపై నిద్రస్తూనే శాశ్వత నిద్రలోకి వెళ్లిన ఓ 15 ఏండ్ల బాలిక చేయి పట్టుకుని ఆమె తండ్రి నిశ్చేష్ఠుడై కూర్చున్న ఫొటో చూపరుల హృదయాలను ద్రవింపజేస్తున్నది.
Turkey Earthquake: టర్కీ, సిరియా సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపాలు ఆ రెండు దేశాల్లో పెను విషాదాన్ని మిగిల్చాయి. వేల మందిని పొట్టనపెట్టుకున్నాయి. భవనాలు కుప్పకూలడంతో నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. అలా మంచంపై నిద్రస్తూనే శాశ్వత నిద్రలోకి వెళ్లిన ఓ 15 ఏండ్ల బాలిక చేయి పట్టుకుని ఆమె తండ్రి నిశ్చేష్ఠుడై కూర్చున్న ఫొటో చూపరుల హృదయాలను ద్రవింపజేస్తున్నది.
టర్కీలోని ఖహ్రమన్మరాస్లో వరుస భూకంపాల ధాటికి పలు భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి. ఆ భవనాల్లో ఉన్న వాళ్లలో చాలామంది సజీవ సమాధి అయ్యారు. మెసట్ హన్సర్ అనే వ్యక్తి కుటుంబం కూడా అలాగే భవనం కింద చిక్కుకుపోయింది. భూకంపం వచ్చినప్పుడు హన్సర్ బయట ఉండటంతో ప్రాణాలతో మిగిలాడు. అదే అతడి పాలిట భరించలేని నరకయాతనగా మారింది.

అతడి కుటుంబమంతా శిథిలాల కిందే ఉంది. మిగతా కుటుంబసభ్యులు బయటికి కనిపించడం లేదు. వాళ్లు బతికున్నారో.. లేదో.. కూడా తెలియదు. కానీ తన 15 ఏండ్ల కూతరు ఇర్మాక్ చేయి మాత్రం బయటికి కనిపిస్తుంది. మంచంపై నిద్రిస్తున్న ఆమెపై స్లాబ్ కుప్పకూలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే, శిథిలాల నుంచి బయటికి కనిపిస్తున్న ఆమె చేయిని చూసి తండ్రి విలవిల్లాడుతున్నాడు.
కుటుంబమంతా ఎలా ఉందోనన్న ఆందోళన ఒకవైపు, అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ ఇక లేదన్న బాధ మరోవైపు, అయ్యో బిడ్డపై నుంచి శిథిలాలను త్వరగా తొలగిస్తే బాగుండునన్న ఆవేదన ఇంకోవైపు.. ఇలా పుట్టెడు దుఖ్ఖంతో దిక్కుతోచని స్థితిలో మెసట్ హన్సర్.. బయటికి కనిపిస్తున్న తన బిడ్డ చేతిని పట్టుకుని శిథిలాలపైనే కూర్చున్నాడు. ఆ దృశ్యానికి సంబంధించిన ఫొటో చూసేవాళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

