న్యూయార్క్: అమెరికాలో రెండు యుద్ధ విమానాలు(2 Jets Collision) ఢీకొన్నాయి. ఎయిర్ షోలో ఈ ఘటన జరిగింది. ఇదాహో రాష్ట్రంలోని మౌంటేన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగిన వైమానిక విన్యాసాల్లో ఈ ప్రమాదం జరిగింది. అయితే రెండు యుద్ధ విమానాలకు చెందిన నలుగురు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా నౌకాదళానికి చెందిన ఈఏ18-జీ యుద్ధ విమానాలు విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలో ఢీకొన్నాయి. విడ్బే ఐలాండ్‌లోని ఎలక్ట్రానిక్ అటాక్ స్క్వాడ్రన్ 129కు చెందిన విమానాలుగా గుర్తించారు. దుర్ఘటన పట్ల విచారణ చేస్తున్నట్లు నౌకాదళ ప్రతినిధి కమాండర్ అమేలియా ఉమయం పేర్కొన్నారు. అయితే ఎయిర్ బేస్‌లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని నిర్వాహకులు కిమ్ స్కైస్ తెలిపారు.
విమానాలు కూలిన ఘటన తర్వాత ఎయిర్ బేస్‌ను మూసివేసినట్లు అధికారులు చెప్పారు. మిగితా ఎయిర్ షోను రద్దు చేశారు. ప్రమాదానికి చెందిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానాలు ఢీకొన్న తర్వాత వాటి నుంచి నాలుగు పారాషూట్లతో పైలట్లు సురక్షితంగా బయటకు వచ్చారు. విన్యాసాల్లో ఢీకొన్న విమానాలను ఈఏ-18జీ గ్రౌలర్గా గుర్తించారు. ఇవి ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ వేరియంట్‌కు చెందినవి. వీటిల్లో అత్యాధునిక యుద్ధ సిస్టమ్స్ ఉంటాయి. విన్యాసాల సమయంలో అతి దగ్గరగా వచ్చిన రెండు విమానాలు, స్పిన్ అయ్యాయి. ఆ తర్వాత స్వల్పంగా మంటలు కనిపించాయి. ఆ తర్వాత వాటి నుంచి పారాషూట్లు రిలీజ్ అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం బాగున్నట్లు అధికారులు చెప్పారు.
WATCH: Two US Navy F/A-18 fighter jets collided mid-air while performing at an air show in Idaho.
All pilots ejected and were seen descending safely under parachutes. pic.twitter.com/nExUeTY84q
— Clash Report (@clashreport) May 17, 2026