Natasha Peri: అత్యంత తెలివైన విద్యార్థినిగా 11 ఏళ్ల నటాషా పేరి
భారత-అమెరికా సంతతికి చెందిన 11 ఏళ్ల నటాషా పేరి ( Natasha Peri ) రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా ఆమె బ్రైటెస్ట్ స్టూడెంట్స్ లిస్టులో పేరు సంపాదించింది.

వాషింగ్టన్: భారత-అమెరికా సంతతికి చెందిన 11 ఏళ్ల నటాషా పేరి ( Natasha Peri ) రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా ఆమె బ్రైటెస్ట్ స్టూడెంట్స్ లిస్టులో పేరు సంపాదించింది. 84 దేశాలకు చెందిన సుమారు 19వేల మంది విద్యార్థులు పాల్గొన్న పరీక్షలో ఆమె టాప్‌లో నిలిచింది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ నిర్వహించిన ట్యాలెంట్ టెస్టులో ఆమె అగ్రస్థానాన్ని సంపాదించింది. సాండ్‌మేయర్ ఎలిమెంటరీ స్కూల్లో నటాషా చదువుకుంటోంది. సీటీవై ట్యాలెంట్ పరీక్షలో భాగంగా నిర్వహించిన ఎస్ఏటీ, ఏసీటీ పరీక్షల్లో నటాషా అత్యుద్భుత ప్రదర్శన ఇచ్చింది. చురుకుగా ఉన్న విద్యార్థుల్లో అకాడమిక్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు సీటీవై పరీక్షలు నిర్వహిస్తుంటారు. 2021 సీజన్లో జాన్స్ హాప్కిన్స్ ట్యాలెంట్ టెస్టుకు నటాషా పేరీ హాజరైంది. అయిదవ గ్రేడ్ చదువువుతున్న ఆ విద్యార్థిని.. వర్బల్, క్వాంటిటేవివ్ సెక్షన్లో.. గ్రేడ్ 8 పర్ఫార్మెన్స్ను ప్రదర్శించింది. సీటీవై ఇచ్చే హై హానర్స్ అవార్డుకు నటాషా ఎంపికైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం : వేల్పుల వేణు గోపాల్
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Tyson Naidu Teaser | మాస్ యాక్షన్ విందుతో బెల్లంకొండ ‘టైసన్ నాయుడు’ టీజర్.!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

