Traffic Alert | హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ సమయంలో ప్రత్యామ్నాయ రూట్లు చూసుకోండి..
టాలీవుడ్, బాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్-2’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ యూసుఫ్‌గూడలో జరుగనుంది. ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు.
హైదరాబాద్: టాలీవుడ్, బాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్-2’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ యూసుఫ్‌గూడలో జరుగనుంది. ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. దేవర హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తుండటం, అందులోనూ బాలీవుడ్ ఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారు. దీంతో యూసుఫ్‌గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) విధించారు. సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు ప్రయాణికులు కేవీబీఆర్ స్టేడియం వైపు వెళ్లకుండా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాల్లో పోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9010203626 నంబర్లోకానీ, @HYDTP సోషల్ మీడియాలో ఫాలోకావాలని తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
- జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వైపు వచ్చే వాహనాలను కృష్ణా నగర్ జంక్షన్ వద్ద మళ్లించి, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట వైపునకు మళ్లించనున్నారు.
- మైత్రివనం జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను యూసుఫ్‌గూడ బస్తీ నుంచి ఆర్బీఐ క్వార్టర్స్, కృష్ణా నగర్ జంక్షన్ వైపు మళ్లించనున్నారు.
- మైత్రివనం జంక్షన్ నుంచి బోరబండ బస్టాప్ వైపు వెళ్లే వాహనాలను సవేర ఫంక్షన్ హాల్ మీదుగా కృష్ణకాంత్ పార్క్, జీటీఎస్ టెంపుల్, కల్యాణ్ నగర్, మోతీ నగర్ మీదుగా బోరబండకు మళ్లించనున్నారు.
- బోరబండ బస్టాప్ నుంచి మైత్రివనం జంక్షన్ వైపు వచ్చే వాహనాలను ప్రైమ్ గార్డెన్ వద్ద మళ్లించి, మిడ్ ల్యాండ్ బేకరీ, జీటీఎస్ కాలనీ, కల్యాణ్ నగర్ జంక్షన్, ఉమేశ్ చంద్ర విగ్రహం యూటర్న్, ఐసీఐసీఐ యూటర్న్ మీదుగా మైత్రివనం జంక్షన్‌కు మళ్లించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

