రవీంద్రభారతి, అక్టోబర్ 31 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో గడిగోలు తెలంగాణ పదాలు, ఇసిరెలు, సంస్కృతి బతుకమ్మ పాటల వీడియోల పోటీల విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి, కవి, రచయిత పెద్దింట అశోక్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. అనంతరం వ్యక్తలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల జీవన సంస్కృతి చాలా గొప్పదని, బతుకమ్మ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత
మనందరిపై ఉందన్నారు. అనంతరం పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీపీఎస్ మెంబర్ సుమిత్రానంద్, మాదవ్ తదితరులు పాల్గొన్నారు.