ఇక సెట్విన్‌లో ఆన్లైన్ శిక్షణ

- వీలున్నప్పుడల్లా వినొచ్చు
- అక్టోబర్ నుంచి తరగతులు షురూ
- నామమాత్రపు ఫీజుతో 25 రకాల కోర్సులు..
- శిక్షణ పూర్తి కాగానే ఆన్లైన్లోనే పరీక్షలు.. సర్టిఫికెట్లు
నిరుద్యోగుల పాలిట కల్పతరువుగా నిలుస్తున్న సెట్విన్ కేంద్రాలు ఆధునీకతను సంతరించుకుంటున్నాయి. నాలుగు దశాబ్దాలుగా యువతీ యువకులకు విశేష సేవలందిస్తున్న ఈ కేంద్రాలు నూతన మార్గదర్శకత్వానికి నాంది పలుకుతున్నాయి. తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ప్రతి యేడు 15 వేల మందికి పైగా నిరుద్యోగులకు శిక్షణనిచ్చే సెట్విన్ కేంద్రాలలో కరోనా ప్రభావంతో ఆఫ్‌లైన్ తరగతులకు బ్రేక్ పడింది. దీంతో 2019-20లో శిక్షణా తరగతులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కేవలం 6600 మందికి మాత్రమే శిక్షణ ఇవ్వగలిగారు. ఈ ఏడాది జులై నుంచి అడ్మిషన్లు ప్రారంభించినా కొవిడ్ నేపథ్యంలో తరగతులు మందకొడిగా సాగుతున్నాయి.
ఈ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న సెట్విన్ అధికారులు ఆన్లైన్ తరగతులకు శ్రీకారం చుడుతున్నారు. నగరంలోని 20 సెట్విన్ కేంద్రాల్లో యథావిధిగా శిక్షణాతరగతులు కొనసాగిస్తూనే ఏ రంగంలో ఉన్న వారైనా.. ఏ సమయంలోనైనా ఆన్లైన్లో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్వయం ఉపాధి శిక్షణను నిరంతరాయంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వయం ఉపాధి కోర్సులకు కేరాఫ్‌గా ఉన్న సెట్విన్‌లో త్వరలో ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. 40 సంవత్సరాలకు పైగా నిరుద్యోగులకు బాసటగా ఉంటూ స్వయం ఉపాధి శిక్షణలో తనదైన ముద్రవేసిన సెట్విన్ ఆన్లైన్ తరగతులకు శ్రీకారం చుట్టనుంది. కరోనా ప్రభావంతో ఉపాధి శిక్షణ కోర్సులు అర్ధాంతరంగా ఆగిపోకుండా ఈ ఆన్లైన్ కోర్సులకు రూపకల్పన చేసింది. ఇప్పటికే సెట్విన్ కేంద్రాలలో 47 స్వయం ఉపాధి కోర్సులలో శిక్షణ అందిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ ఏడాది కంప్యూటర్ సంబంధిత 25 కోర్సుల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించనున్నారు. సెట్విన్ ఆన్లైన్ పోర్టల్‌లో శిక్షణకు సంబంధించి పూర్తి నిడివి గల వీడియో తరగతులను పొందుపరిచారు. నిరుద్యోగ యువతీ, యువకులతో పాటు విద్యార్థులు ఆ వెబ్సైట్లోకి వెళ్లి ఆయా కోర్సులను నేర్చుకోవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు సైతం ఏ సమయంలోనైనా ఆన్లైన్ తరగతులను వినొచ్చు. అదే సమయంలో సందేహాలను సైతం నివృత్తి చేసుకోవచ్చు.
అన్నీ ఆన్లైన్లోనే..
నిరుద్యోగ యువతీ యువకులకు నామమాత్రం ఫీజులతో నాణ్యమైన ఉపాధి కోర్సులను ఆన్లైన్ ద్వారా అందించే ప్రయత్నాలు ప్రారంభించాం. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.సెట్విన్.ఆన్లైన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వీడియోల రూపంలో ఉన్న తరగతులను తమకు వీలున్న సమయంలో వినవచ్చు. ఆ తర్వాత ఆన్లైన్లోనే పరీక్షలకు హాజరై సర్టిఫికెట్లు పొందవచ్చు. ఆన్లైన్ శిక్షణా తరగతులను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలి. – వేణుగోపాల్ రావు, సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

