జూనియర్‌పై సీనియర్ విద్యార్థుల దాడి
మహావీర్ ఇంజినీరింగ్ కళాశాలలో జూనియర్ విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో సీనియర్ విద్యార్థులపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
- విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్
మైలార్‌దేవ్‌పల్లి, జూలై 26: మహావీర్ ఇంజినీరింగ్ కళాశాలలో జూనియర్ విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో సీనియర్ విద్యార్థులపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మహావీర్ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఈ నెల 23న కళాశాల ఆడిటోరియంలో సెమినార్ ఉండటంతో తరగతి గదుల్లోకి వెళ్లి.. హాజరు కావాలని చెప్పాడు. దీంతో సీనియర్ విద్యార్థులు.. అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు.. చిన్నగా చెప్పొచ్చుకదా..
అని సూచించారు. దీంతో జూనియర్ విద్యార్థి, సీనియర్ విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శుక్రవారం వీరి మధ్య మరోసారి వాగ్వివాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం సీనియర్ విద్యార్థులు ఐదుగురు కలిసి జూనియర్ విద్యార్థిని బాత్రూమ్ వద్ద పట్టుకొని గొడవకు దిగుతావా.. అంటూ దాడి చేశారు. దీంతో బాధితుడు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో సీనియర్ విద్యార్థులపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీనియర్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
IAS Shikhar Agrawal: 40 విల్లాలు కొన్న ఐఏఎస్ ఆఫీసర్.. హోల్డ్‌లో శిఖర్ అగర్వాల్ పోస్టింగ్
ప్రజా తిరుగుబాట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

