బంజారాహిల్స్, అక్టోబర్ 11 : వినియోగదారులకు పండుగల ఆనందాన్ని మరింత పెంచేందుకు ప్రతి ఏటా నిర్వహించే “నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే” దసరా బొనాంజా వేడుకల్లో రెండో రోజు లక్కీ డ్రాను బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని కేఫ్ నిలోఫర్‌లో బుధవారం సాయంత్రం ఉత్సాహంగా నిర్వహించారు. కస్టమర్లు, స్పాన్సర్ల సమక్షంలో నమస్తే తెలంగాణ అడ్వర్టయిజ్మెంట్ విభాగం జీఎం సురేందర్ రావు, ఏజీఎంలు రాజి రెడ్డి, రాములు, డిప్యూటీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, శ్రీఅను యాడ్స్ అధినేత చంద్రేశ్వర్ రావు, నిలోఫర్ కేఫ్ ఎండీ ఎ.శశాంక్ చేతుల మీదుగా ఐదుగురు విజేతలను ఎంపిక చేశారు.
విజేతలు వీరే..!
మొదటి బహుమతిగా 32 ఇంచుల టీవీని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసిన చాను (టో.నం. 19010) గెలుచుకున్నారు. రెండవ బహుమతిని చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేసిన లావణ్య (టో.నం.20705) మొబైల్ ఫోన్‌ను గెలుపొందారు. మూడవ బహుమతిని వెంకటరమణ మోటార్స్‌లో షాపింగ్ చేసిన అజార్ (టో.నం. 65104) మైక్రో ఓవెన్ గెలుచుకున్నారు. వీరితో పాటు వెంకటరమణ మోటార్స్‌లో షాపింగ్ చేసిన నిఖత్ (టో.నం.65196), ఏబీఆర్ కేఫ్అండ్బేకరీలో షాపింగ్ చేసిన రాహుల్ (టో.నం. 41991) గిఫ్టు వోచర్లను సొంతం చేసుకున్నారు.
నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే వారికి కృతజ్ఞతలు
అమీర్‌పేట్‌లోని చెన్నై షాపింగ్ మాల్లో మంగళవారం షాపింగ్ చేశాను. పండుగ కోసం నూతన వస్ర్తాలు కొనుగోలు చేశాను. ఆ సమయంలో “నమస్తే తెలంగాణ-తెలంగాణ టూడే” బంపర్ బొనాంజా టోకెన్ ఇచ్చారు. ఇలాంటివి సర్వ సాధారణమే అనుకున్నాను. కానీ ఊహించని స్థితిలో విలువైన ఫోన్ బహుమతిగా వచ్చిందని నిర్వాహకులు చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే వారికి కృతజ్ఞతలు.
-లావణ్య, గృహిణి, వెంగళ్రావునగర్
కష్టమర్లకు మరింత సంతోషాన్ని ఇస్తుంది
“నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే” దసరా బొనాంజా వేడుకల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రజలకు దసరా పండుగ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఆ పండుగను సామాన్యులు కూడా సంతోషంగా జరుపుకునేందుకు ప్రతి ఏడాది బంపర్ బొనాంజా కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం. బంపర్ బొనాంజా నిర్వహిస్తున్న “నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే”కు కృతజ్ఞతలు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింత ఆదరణ పొందాలి. బహుమతులు గెలుచుకున్న విజేతలకు అభినందనలు.
-చంద్రేశ్వర్ రావు, శ్రీ అను యాడ్స్, అధినేత.
తెలంగాణ బ్రాండ్‌గా కేఫ్ నిలోఫర్
హైదరాబాద్ నగరంలో చాయ్ ప్రియులను ఎంతగానో అలరిస్తూ తెలంగాణ బ్రాండ్‌గా అభివృద్ధి చెందిన కేఫ్ నిలోఫర్ “నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే” దసరా బొనాంజాలో ప్రతి ఏటా భాగస్వామ్యమవుతున్నాం. నగరంలో ఐదు ఔట్లెట్స్ నిర్వహిస్తూ కస్టమర్ల ఆదరణ పొందుతున్నాం. త్వరలోనే దేశంలోని ఇతర నగరాల్లో కూడా కేఫ్ నిలోఫర్ ఔట్లెట్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నగరంలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా కేఫ్ నిలోఫర్‌కు కస్టమర్లు వచ్చి చాయ్ రుచులను ఆస్వాదిస్తుంటే మాకు చాలా తృప్తిగా ఉంటుంది.
-శశాంక్, కేఫ్ నిలోఫర్, ఎండీ.