ఓ జంట వినూత్న ఆలోచనతో వివాహ వేడుక

- ఎవరికీ ఇబ్బంది లేకుండా
- పెండ్లి నుంచి బరాత్ వరకూ అంతా అంతర్జాలంలోనే..
- ఆన్లైన్లో కట్న కానుల పేమేంట్..!
- నెట్టింట్లో వైరల్‌గా మారిన లగ్న పత్రిక
కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొవిడ్ విస్తృతంగా వ్యాపిస్తూ శుభకార్యాలు, వేడుకలకు ఆటంకంగా మారింది. దీంతో విందులు, వివాహ వేడుకలను తేదీలను ముందస్తుగా పెట్టుకున్నవారు సైతం ఇప్పుడు నిర్వహణకు వెనకడుగు వేస్తున్నారు. కొందరు మాత్రం కరోనా లేదు.. గిరోనా లేదంటూ నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వివాహ జంట ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా వినూత్న ఆలోచన చేసింది. పెండ్లి తంతును డిజిటల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీక్షించాలని కోరడమే గాక, కట్న కానుకలను సైతం డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించాలని పేర్కొనడం విశేషం. ఈ మేరకు రూపొందించిన పెండ్లి కార్డ్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నది. ప్రస్తుతం నెటిజన్లను ఇది విశేషంగా ఆకట్టుకుంటున్నది.
- సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన జీల నిర్మల – మల్లేశ్ యాదవ్ దంపతుల కుమారుడు జీల అనిల్ యూ ట్యూబ్ వీడియోలు చేస్తుంటడు.
- అతనికి ఇటీవలే ఆమనితో వివాహం నిశ్చయమైంది.
- ఇదిలా ఉంటే, ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిరాడంబరంగా స్థానిక రామలింగేశ్వర ఆలయంలో పెండ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నరు.
- అయితే బంధువులను, సన్నిహితులను చిన్నబుచ్చకుండా ఉండేందుకు వినూత్న ఆలోచన జేసిండు అనిల్.
- ఈ మేరకు తెలంగాణ యాసలో లగ్న పత్రిక రాయించి అందరికీ పోస్ట్ చేసిండు. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసిండు.
- ఇప్పుడది వైరల్‌గా మారింది. ఆ పెండ్లి కార్డు చూసినోళ్లంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నరు.
- ఇంతకు అందుల ఏమున్నదంటే పెండ్లి తంతుతో పాటు బరాత్ వరకూ ఇస్టాగ్రామ్లోనే లైవ్‌లోనే చూడాలని విజ్ఞప్తి చేయడం విశేషం.
- అదీగాక ఇంటి నుంచే లైవ్‌ల పెండ్లి చూడటంతో పాటు కట్న కానుకలను ‘గూగుల్ పే, ఫోన్ పే’ ద్వారా పంపాలని అందుకు సంబంధించిన ‘క్యూఆర్’ కోడ్‌తో పాటు, బహుమతులు పోస్ట్ ద్వారా పంపాలని ఇంటి అడ్రస్ కూడా ఇవ్వడం కొసమెరుపు.
- ఇక బంధువులందరూ ఎవరింట్ల వాళ్లు బరాత్ డ్యాన్స్ చేసి ఈ వీడియో పంపితే అది కూడా లైవ్ పెడతామని చెప్పడం మరో విశేషం.
- ఇప్పుడీ పెండ్లి కార్డు నెట్టింట్లో హల్ చేస్తున్నది.
- మరి ఎంత మంది ఈ ఆ పెండ్లి చూస్తరో.. ఏమో.. కాని, ఇదేదో మంచిగుందని అందరూ కామెంట్లు పెడుతున్నరు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

