అంబులెన్స్, అత్యవసర సేవలకు గ్రీన్‌చానల్

సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ), ఉప్పల్: లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని.. అనుమతి లేకుండా బయటికి వచ్చేవారిపై చర్యలు తప్పవని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. బుధవారం ఉప్పల్, రామంతాపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఆయన తనిఖీ చేశారు. వాహనదారులను ఆపి అనుమతి పత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని కోరారు. లాక్డౌన్లో తయారీ, నిర్మాణ రంగాలు, ఐటీ, ఫార్మా రంగాలు రెండు షిఫ్టుల సమయ పాలన పాటిస్తున్నాయని తెలిపారు. అత్యవసర వాహనాలు, అంబులెన్స్‌లు సజావుగా వెళ్లేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు, స్నాక్స్, వాటర్‌బాటిళ్లు పంపిణీ చేశారు.
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉదారత..
సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ఓ గర్భిణిని ఇంటికి చేర్చి.. మానవత్వాన్ని చాటుకున్నారు నాంపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. నాంపల్లి ఏరియా దవాఖాన నుంచి గర్భిణి నడుచుకుంటూ వెళ్తుండగా, ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేశ్‌యాదవ్ ఆమెను ఆపి విషయం తెలుసుకున్నారు. వాహనాలు లేకపోవడంతో నడుచుకుంటూ.. మెహిదీపట్నంలోని తన ఇంటికి వెళ్తున్నానని చెప్పడంతో చలించిపోయారు. వెంటనే తన కారులో ఆమెను తన ఇంటి వద్ద దించిరావాలంటూ.. డ్రైవర్‌కు సూచించారు. ఇంటికి చేరుకున్న ఆ మహిళ కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- mahesh bhagat ips
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

