జంట జలాశయాలకు భారీగా వరద

- ఉస్మాన్‌సాగర్ నాలుగు గేట్ల నుంచి 960 క్యూసెక్కులు
- హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా 700 క్యూసెక్కుల నీరు మూసీకి విడుదల
సిటీబ్యూరో, సెప్టెంబరు 27(నమస్తే తెలంగాణ): విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రిజర్వాయర్ల గేట్లను ఎత్తివేసి దిగువనున్న మూసీలోకి అధికారులు నీటిని వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్ గరి ష్ట స్థాయి నీటి మట్టం 1790.00 అడుగులు కా గా, సోమవారం నాటికి 1789.85 అడుగులకు చేరింది. ఎగువ నుంచి రిజర్వాయర్‌లోకి 400 క్యూసెక్కుల నీరు వస్తుందని అంచనా వేసిన అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 960 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అలాగే, హిమాయత్‌సాగర్ గరిష్ట స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, 1763.30 అడుగులకు చేరి నిండుకుండలా మారింది. ఈ రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో రెండు గేట్లను ఎత్తి 700 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Himayath sagar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

