హైదరాబాద్: డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు టోనీ ప్రస్తుతం పంజాగుట్ట పోలీసుల కస్టడీలో ఉన్నాడు. చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు టోనీని స్టేషన్‌కు తరలించి విచారించారు. మొదటి రోజు విచారణలో భాగంగా టోనీ నుంచి పోలీసులు పలు వివరాలు సేకరించారు. వ్యక్తిగత వివరాలతో అతడి స్టేట్మెంట్ను స్పెషల్ టీమ్ రికార్డు చేసింది. టోనీ ఏజెంట్స్, డ్రగ్ నెట్వర్క్ బ్రేక్ చేసే కోణంలో ప్రశ్నించారు.
ముంబై, గోవా ఏజెంట్లతో హైదరాబాద్‌కు ఉన్న లింక్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ టార్గెట్‌గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్టార్ బాయ్ కోణంలో ఇంగ్లీష్‌లోనే టోనీని పోలీసులు ప్రశ్నించారు. స్టార్ బాయ్ కోసం ట్రాన్సలేటర్ సాయంతో పోలీసులు టోనీని ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్‌లోని సప్లయర్స్‌కు, టోనీకి లింక్స్‌పై పోలీసులు ఆరా తీశారు.