అదనపు కట్నం కోసం వేధింపులు

భర్త, అత్తకు ఏడాది పాటు
జైలు శిక్ష.. పది వేలు జరిమానా
అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసిన తల్లీకొడుకులకు ఏడాది పాటు జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ.. మేడ్చల్ కోర్టు బుధవారం తీర్పును వెల్లడించింది. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల డివిజన్ వెన్నెలగడ్డ ప్రాంతానికి చెందిన పోచమ్మల ప్రశాంత్, రేవతిలకు 2013లో వివాహం జరిగింది. వివాహం సమయంలో రూ.6.20లక్షల నగదుతో పాటు 18 తులాల బంగారం, గృహఅవసర వస్తువులను కట్నకానుకల కింద ఇచ్చి పెద్దల సమక్షంలో పెండ్లి చేశారు. పెండ్లయిన మూడు నెలల తర్వాత అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. తన భర్తతో పాటు అత్తామామలు, ఆడపడుచులు అదనపు కట్నం కోసం వేధించసాగారు. ఇదే సమయంలో పాప పుట్టింది. అయినప్పటికీ వేధిస్తుండటంతో రేవతి తల్లిదండ్రులు రెండు తులాల బంగా రం, వెండి ఆభరణాలు పెట్టారు. వీటితో సరిపెట్టుకోని భర్త, అత్తామామలు మరో 150 గజాల ప్లాట్‌తో పాటు ఇతర వస్తువులు పెట్టాలని రేవతిని మానసికంగా, శారీరకంగా వేధించారు. పెద్ద మనుషులు చెప్పినా తీరు మార్చుకోలేదు. దీంతో చేసేది లేక రేవతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన మేడ్చల్ కోర్టు నేరం రుజువు కావడంతో భర్త ప్రశాంత్, అత్త జయలక్ష్మికి ఏడాది పాటు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- dowry case
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

