అదిరేటి డ్రెస్సు మేమేస్తే..!
‘మాఘ మాసం ఎప్పుడొస్తుందో..’ అని ఒకప్పుడు కాబోయే పెళ్లికూతుళ్లు కలలు కనేవారు. ఫ్యాషన్ ప్రపంచంలో యువతులు ఈ కలలపై కన్నేస్తున్నారు. మాఘ మాసంలో పెళ్లి కూతురుకు పోటీ ఇస్తూ.. ఫ్యాషన్ దుస్తుల ఎంపికలో చాలామంది యువతీ యువకులు ఈ సీజన్ ట్రెండ్‌ను అనుసరించడానికి మొగ్గు చూపుతున్నారు.
- మాఘమాసం ఫ్యాషన్‌లో అమ్మాయిలదే పైచేయి..ఫ్యాషన్‌లో న్యూ జనరేషన్ ప్రయోగాలు..
- ట్రెండ్‌కు తగ్గ డ్రస్సుల ఎంపిక..
- ఆల్‌టైం ఫేవరెట్‌గా జీన్స్ టీ షర్ట్స్
- వేడుకలు.. పార్టీలకు మాత్రం ప్రత్యేక దుస్తులపైనే ఆసక్తి..
- మగ్గం వర్క్‌పై ప్రత్యేక ఆకర్షణ..
- కలర్ ఫుల్ డ్రెస్సులతో మరింత అందంగా..
జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 23: ‘మాఘ మాసం ఎప్పుడొస్తుందో..’ అని ఒకప్పుడు కాబోయే పెళ్లికూతుళ్లు కలలు కనేవారు. ఫ్యాషన్ ప్రపంచంలో యువతులు ఈ కలలపై కన్నేస్తున్నారు. మాఘ మాసంలో పెళ్లి కూతురుకు పోటీ ఇస్తూ.. ఫ్యాషన్ దుస్తుల ఎంపికలో చాలామంది యువతీ యువకులు ఈ సీజన్ ట్రెండ్‌ను అనుసరించడానికి మొగ్గు చూపుతున్నారు.
మార్కెట్లోకి వచ్చిన కొత్త డిజైన్లపై ఓ కన్నేస్తున్నారు. ముఖ్యంగా కాలేజీ గర్ల్స్ తమ డ్రెస్సుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో ఫ్యాషన్ డిజైనర్లను సైతం సంప్రదిస్తూ.. ట్రెండ్‌కు అనుగుణంగా ప్రత్యేక దుస్తులను తయారు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందంగా కనిపించాలని కోరుకునే ప్రతి అమ్మాయి.. ఈ సీజన్లో అందుబాటులోకి వచ్చే సరికొత్త ఫ్యాషన్ దస్తులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తమ శరీరానికి నప్పే దుస్తులను ఎంచుకోవడంలో ధరలకు వెనుకాడటం లేదు.
జీన్స్, టీ షర్ట్స్కే మొదటి ప్రాధాన్యత..
చదువుకునే కాలేజైనా.. కళ్యాణ వేడుకైనా.. తొలుత అమ్మాయిలు జీన్స్, టీ షర్టులకే జై కొడుతున్నారు. జీన్స్‌ను చాలామంది అమ్మాయిలు ధరిస్తుండటంతో ప్రత్యేక ఆకర్శణలో వెనుకబడుతున్నారు. అయితే, జీన్స్‌లో రిఫ్ట్ జీన్స్ లేదా టోర్న్ జీన్స్‌తో ప్రత్యేకతను చాటుకోవచ్చని ప్రముఖ డిజైనర్ మౌనిక చెప్పారు. శరీర ఆకృతి ఆధారంగా ఎంపికచేసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. టాప్స్ ఎంపికలో ఎక్కువగా డిజైనింగ్ లేకుండా ఉంటేనే సింపుల్ అండ్ ైస్టెలిష్‌గా ఉంటుందన్నారు.
లాంగ్ గౌన్స్ అందరికీ సూట్ అవుతున్నందున క్రాప్టాప్స్ను ఈ జనరేషన్ అమ్మాయిలు విరివిగా ధరిస్తున్నారన్నారు. ఈ తరహా దుస్తులతో చూపరులను సూపర్బ్‌గా టీజ్ చేయొచ్చు. స్కిన్ ఫిట్ ప్యాంట్లు అసమానంగా అంచులను కట్‌చేసి ధరిస్తే బాగుంటుందని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అమ్మాయిల ఎంపికలో పెప్లం టాప్స్ ముందు వరుసలో ఉంటున్నాయి. బాటమ్ ఏదైనా షార్ట్స్, చిక్ ప్యాట్స్, స్కర్ట్స్ అన్నింటి మీద ఇది బాగా నప్పుతుందని చెబుతున్నారు. ఇందులో విభిన్న రకాల స్లీవ్ లెస్‌లు ప్రత్యేక ఆకర్శణతో పాటు ధరించిన వారికి అదనపు అందాన్ని అందిస్తాయి.
ఫ్యాషన్ డిజైనర్ల వద్దకు విద్యార్థినులు..
ప్రస్తుతం అమ్మాయిలు ఎక్కువగా వెస్టర్న్ స్కర్ట్స్, షార్ట్స్, లాంగ్ డ్రెసెస్‌ను పార్టీలలో ధరించడానికి బాగుంటాయని నిఫ్ట్ కాలేజీ విద్యార్థిని శరణ్య తెలిపారు. చాలా రకాల డిజైన్లు మార్కెట్లో ఉన్నప్పటికీ.. ఇంకా వెరైటీ కావాలనుకునే వారు ఫ్యాషన్ డిజైనర్లను సంప్రదిస్తే వారికి నచ్చిన విధంగా డిజైన్ చేసి పెడతారని సూచించారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థినులు ఫ్యాషన్ డిజైనర్లకు తమ దుస్తులకు సంబంధించిన ఆర్డర్లు ఇస్తున్నారన్నారు.
ఓవరాల్ అప్పిరియెన్స్ మెరుగు పడాలంటే బ్రైట్ కలర్స్ ధరించాలి..
అమ్మాయిలు ఈవెంట్‌ను బట్టి డ్రెస్సులను ఎంపిక చేసుకోవాలి. షాపుల్లో తరచూ ఉన్న కలర్స్‌పై ఆసక్తి చూపడంలేదు. అమ్మాయిలు ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు. ఒక్కో ఈవెంట్‌కు వైవిధ్యమైన డ్రెస్‌లు వేసుకోవడానికి ఇష్టపడతారు. మేం చాలా మంది విద్యార్థినులకు డిజైనింగ్ వర్క్ చేసి పెట్టాం. వారి అభిరుచికి తగ్గట్టు స్కెచ్ డిజైన్ వేసి చూపిస్తాం. ఈ జనరేషన్లో చాలామంది స్టూడెంట్స్ చేనేత దుస్తులను వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
హ్యాండ్ లూమ్స్‌పై విభిన్న రకాల స్టోన్స్ వేసుకుంటున్నారు. మరికొంత మంది కాటన్స్లో కాజువల్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మగ్గం వర్క్ చాలా క్రేజ్ సొంతం చేసుకుంది. అందులో పువ్వులు, బొమ్మలు కాకుండా కొంత డిఫరెంట్‌గా మాన్యూర్ డిజైన్స్‌కు మార్పించుకుని ధరిస్తున్నారు. ఫ్రాక్స్, డెనిమ్ జాకెట్, లాంగ్ కుర్తాలు ధరిస్తున్నారు. స్లీవ్‌లెస్ ఫ్రాక్స్, దోతీ పాయింట్, పలాజ, ఓ బేబివల్ల తదితర వైవిధ్యమైన దుస్తులు ఇప్పుడు ఫ్యాషన్ బుల్గా ఉంటున్నాయి.
– మౌన గుమ్మడి, ఫ్యాషన్ డిజైనర్
డ్రెస్‌కు తగ్గ మేకప్ ఉంటే మరింత అందంగా..
మేం డ్రస్సుల ఎంపికలో చాలా కష్టపడుతామనేది నిజం. నచ్చిన దుస్తులను కొనడానికి కనీసం పది నుంచి పదిహేను షాపులు తిరుగుతాం. ధరిస్తే బాగా అనిపిస్తుందా..? లేదా..? అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. డ్రెస్ కొనగానే మా షాపింగ్ పూర్తవదు. వాటికి మ్యాచింగ్ వస్తువులు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఫుట్‌వేర్స్, ఇయర్ రింగ్స్ తదితర యాక్ససరీస్ కొనాల్సిందే. హ్యాండ్‌బ్యాగ్ కూడా మ్యాచింగ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అందులోనే మేకప్ కిట్ పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. అయితే, ప్రతిరోజు వెరైటీగా విభిన్న రకాల డ్రెస్‌లు వేసుకోవడమంటే చాలా కష్టం. డ్రెస్‌కు తగ్గట్టుగా మేకప్ చేసుకుంటే మరింత అందంగా కనిపించే వీలు ఉంటుంది. మారుతున్న ఫ్యాషన్‌కు అనుగుణంగా డ్రెస్‌ల ఎంపిక ఉండేలా చూసుకుంటాం. – పల్లవి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

