యువతి సెల్‌ఫోన్ డ్రైవింగ్.. 23 చలాన్లు

- యువతికి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్..
- మరో రెండు వాహనాలపై 144 చలాన్లు
సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): హెల్మెట్ లేకుండా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న ఓ యువతి వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేయగా.. 23 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని తేలింది.. వివరాల్లోకి వెళ్తే… ఇటీవల సైబరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లిలో ఓ యువతి హెల్మెట్ ధరించకుండా సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంది… అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఆ యువతి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా… 23 చలాన్లు ఉన్నాయని బయటపడింది.. అందులో పరిశీలించగా సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తో పాటు హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపిస్తున్నదని తేలింది.. అయితే .. ‘ప్రమాదం జరగక ముందే మేల్కో అంటూ’ బుధవారం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో వాహనదారులను అప్రమత్తం చేస్తూ ఓ పోస్టింగ్ పెట్టారు. వాహనాలను నడిపించే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించి.. సురక్షితంగా ఉండాలని సూచించారు. ఇలా.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ ద్విచక్రవాహనాన్ని నడిపించిన యువతికి, ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. 23 చలాన్ల రుసుం రూ. 9వేలను కట్టించారు..
మల్కాజిగిరిలో….
మల్కాజిగిరి పరిధిలో బుధవారం రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు వాహనాలను పరిశీలించగా .. ఒక బైక్(ఏపీ 36 ఏవీ 0181)పై 52, మరో బైక్ (ఏపీ 13 ఏసీ 0754)పై 92 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు.. వెంటనే ఆ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.. ఇందులో హెల్మెట్ లేకుండా వాహనం నడపడం…ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌లు చేసినట్లు ఉన్నాయి. దీంతో 52 చలాన్లకు రూ.17 వేలు చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లగా.. 92 చలాన్లు ఉన్న వాహన యజమాని చలాన్ చెల్లించలేదని మల్కాజిగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుధీర్ కృష్ణ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Cell phone driving
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

