ఎలక్ట్రానిక్ హబ్ @కొంగరకలాన్
రంగారెడ్డిజిల్లా కొంగరకలాన్ భవిష్యత్‌లో ఎలక్ట్రానిక్ హబ్‌గా మారనున్నిది. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్ సమీపంలో ఇప్పటికే చైనాకు చెందిన ప్రతినిధులు రూ.4,634కోట్లతో ఫాక్స్‌కాన్ సంస్థను ఏర్పాటు చేశారు.
- రంగారెడ్డి జిల్లాకు మరో ఎలక్ట్రానిక్ పరిశ్రమ
- ఫాక్స్‌కాన్ తరహాలో కొంగరకలాన్‌లో కేన్స్ సెమికాన్
- రూ.3000కోట్లతో స్థాపించనున్న కంపెనీ
- త్వరలో ఎలిమినేడులో మరో ఎలక్ట్రానిక్ పరిశ్రమ
రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ ఎలక్ట్రానిక్ హబ్‌గా మారనున్నది. కలెక్టరేట్ సమీపంలో ఇప్పటికే చైనాకు చెందిన ప్రతినిధులు రూ.4,634 కోట్లతో ఫాక్స్‌కాన్ సంస్థను ఏర్పాటు చేయగా, రూ.3000కోట్ల పెట్టుబడితో బెంగళూరుకు చెందిన పారిశ్రామిక వేత్తలు కేన్స్ సెమికాన్ అనే మరో ఎలక్ట్రానిక్ సంస్థను ప్రారంభించారు. మంగళవారం టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి, రాచకొండ పోలీసు కమిషనర్ దేవేంద్ర చౌహాన్‌తో కలిసి భూమిపూజ చేశారు. త్వరలోనే ఎలిమినేడులోనూ మరో ఎలక్ట్రానిక్ సంస్థ ఏర్పాటు కానున్నది. కేన్స్ సెమికాన్ పరిశ్రమలో అనేకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయనున్నారు. ఇప్పటికే కంపెనీల ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుండగా, కేన్స్ సెమికాన్లో వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
– ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 24
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 24 : రంగారెడ్డిజిల్లా కొంగరకలాన్ భవిష్యత్‌లో ఎలక్ట్రానిక్ హబ్‌గా మారనున్నిది. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్ సమీపంలో ఇప్పటికే చైనాకు చెందిన ప్రతినిధులు రూ.4,634కోట్లతో ఫాక్స్‌కాన్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో పరిశ్రమల పనులు చకచకా సాగుతున్నాయి. 2024 మేలో ఉత్పత్తులు ప్రారంభించాలనే పట్టుదలతో పనులు చేపడుతున్నారు. ఈ పరిశ్రమకు అతిసమీపంలోనే బెంగుళూరుకు చెందిన పారిశ్రామిక వేత్తలు కేన్స్ సెమికాన్ అనే మరో ఎలక్ట్రానిక్ సంస్థను ప్రారంభించారు. సుమారు రూ.3000కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి, రాచకొండ పోలీసు కమిషనర్ దేవేంద్రచౌహాన్ కలిసి మంగళవారం భూమిపూజ చేశారు. దీంతో కొంగరకలాన్‌లో రెండు ప్రముఖ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. ఫాక్స్‌కాన్ కంపెనీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మంది ఉపాధి పొందే అవకాశాలుండగా…కేన్స్ సెమికాన్లో వెయ్యి మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే, త్వరలోనే ఎలిమినేడు గ్రామంలో కూడా మరో ఎలక్ట్రానిక్ కంపెనీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే టీఎస్ఐఐసీ ద్వారా భూసేకరణ చేపట్టింది. త్వరలోనే ఎలిమినేడులో కూడా మరో ఎలక్ట్రానిక్ సంస్థ ఏర్పాటు కానుంది. కేన్స్ సెమికాన్ పరిశ్రమలో అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల పరికరాలను తయారుచేయనున్నారు.
ఎలక్ట్రానిక్ రంగం కొతపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆయా పరికరాలకు ఉపయోగించే అతి ముఖ్యమైన పరికరాలను ఇక్కడ తయారుచేయనున్నారు. ఫాక్స్‌కాన్‌లో సెల్ఫోన్లు తయారుచేయనుండగా…కేన్స్ సెమికాన్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లతో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉపయోగించే అతిముఖ్యమైన సెమీ కండక్టర్స్‌ను ఇందులో తయారుచేయనున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పెట్టుబడిదారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఇతర దేశాలకు చెందిన పెట్టుబడిదారులు కూడా కొంగరకలాన్ సమీపంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐపాస్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నవారికి వారం రోజుల్లో అనుమతులు జారీ చేస్తున్నారు. అలాగే, పెట్టుబడిదారులకు భూమి, విద్యుత్, నీరు వంటి ముఖ్యమైన సదుపాయాలను కూడా ప్రభుత్వమే కల్పిస్తున్నది. అలాగే, పెట్టుబడిదారులు దర్జాగా తమ వ్యాపారాలు జరుపుకోవటం కోసం అవసరమైన భద్రతను కూడా తెలంగాణ పోలీసులు కల్పిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి మరికొంతమంది పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
Bodies of SPOs | దారుణం.. శవపేటికలు లేకుండా డంపర్‌లో పోలీసుల మృతదేహాలు తరలింపు..!
buses carrying pilgrims collide | యాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. నలుగురు మృతి, 30 మందికి గాయాలు
Kondagattu | కొండగట్టులో ఆర్జిత సేవలు , వీఐపీ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

