డ్రాయింగ్ కోసం ఓ ప్రత్యేక స్కేలు
డ్రాయింగ్ సునాయాసంగా చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. డ్రాయింగ్ చేయాలంటే దానికంటూ ఓ ప్రత్యేకమైన పరికరం ఇప్పటి వరకు రాలేదు. ఆ ఘనతను నగరంలోని బీరంగూడకు చెందిన చిగుళ్ల కిశోర్ బాబు సాధించారు.
- త్వరలోనే పేటెంట్ హక్కులు కిశోర్ బాబు
ఖైరతాబాద్, మే 6: డ్రాయింగ్ సునాయాసంగా చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. డ్రాయింగ్ చేయాలంటే దానికంటూ ఓ ప్రత్యేకమైన పరికరం ఇప్పటి వరకు రాలేదు. ఆ ఘనతను నగరంలోని బీరంగూడకు చెందిన చిగుళ్ల కిశోర్ బాబు సాధించారు. ఓ డ్రాయింగ్ స్కేల్‌ను రూపొందించి దానిపై అవగాహన లేని వారు కూడా సునాయాసంగా ఆ విద్యను నేర్చుకునే వీలు కల్పించారు. బీరంగూడకు చెందిన కిశోర్ బాబు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. కొవిడ్ సమయంలో ఆ ఉద్యోగం సైతం వదిలివేశారు. ఖాళీగా ఉన్న సమయంలో వినూత్నంగా ఆలోచించారు. తనకు డ్రాయింగ్‌పై ఉన్న మక్కువతో నెలల తరబడి దానిపై పరిశోధనలు జరిపారు. చివరకు స్కేల్ లాంటి పరికరాన్ని తయారు చేశారు.
అది సక్సెస్ కావడంతో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ‘హరిప్రియ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్’ పేరుతో చిన్న కర్మాగారాన్ని స్థాపించి ఫైబర్ గ్లాసు లాంటి ముడి సరుకులను తెప్పించి 154 గ్రాముల డ్రాయింగ్ స్కేల్‌ను రూపొందించారు. డ్రాయింగ్ కోసం ఓ ప్రత్యేక పరికరం ఇంత వరకు ఎవరూ తయారు చేయలేదని, తాను రూపొందించిన డ్రాయింగ్ స్కేల్ ప్రపంచంలో ఎక్కడా కనిపించదని కిశోర్ బాబు అన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు దీని ద్వారా సునాయాసంగా డ్రాయింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ పరికరంతో డ్రాయింగ్ నేర్చుకోవాలనుకునే వారు ‘కిశోర్స్ డ్రాయింగ్ స్కేల్’ పేరుతో యూట్యూబ్‌లో వీడియోలను చూస్తే సరిపోతుందని అన్నారు. గతేడాది పేపెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసినట్టు, త్వరలోనే అది సాకారమవుతుందని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Drawing
- special scale
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

