Ugadi Panchangam | శోభకృత్ నామ సంవత్సరంలో కన్యా రాశివారికి ఎలా ఉంటుందంటే..
గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. కేతువు అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేసుకోండి. తరచూ ఆదివారాలు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆదాయం: 2
వ్యయం: 11
రాజపూజ్యం: 4
అవమానం: 7
చైత్రం: ఈ నెల సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటారు. కొత్త పనుల్లో ఆచితూచి వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండండి.
వైశాఖం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్నదమ్ములలో సఖ్యత నెలకొంటుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. నలుగురికీ సాయమందిస్తారు.
జ్యేష్ఠం: కుటుంబంలో పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబంతో కాలం సంతృప్తిగా గడుపుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వల్ల చికాకులు కలుగవచ్చు.
ఆషాఢం: ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగులకు పనిభారం పెరుగవచ్చు. అయినా, అధికారుల ఆదరణ, సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆదాయంలో అస్థిరత కారణంగా పనుల్లో జాప్యం జరుగవచ్చు.
అధిక-నిజ శ్రావణం: మానసికంగా ఒత్తిళ్లు ఉంటాయి. అన్ని వేళలా అత్యుత్సాహం వద్దు. ఆచితూచి పనులు చక్కబెట్టండి. నెలాఖరున విద్యార్థులకు అనుకూల సమయం. పోటీపరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు.
భాద్రపదం: పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తి ఉన్నా పనివారితో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. స్నేహితుల వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. వివాదాల జోలికి వెళ్లకండి.
ఆశ్వయుజం: బంధువులు, స్నేహితులతో వాగ్వివాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడండి. శ్రమ ఎక్కువైనా చేపట్టిన కార్యాల్లో విజయం సాధిస్తారు. నలుగురికీ ఉపయోగపడే పనులు చేస్తారు. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి.
కార్తికం: ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. కొత్త పనులు చేపట్టే ముందు ఆచితూచి వ్యవహరించండి. స్నేహితుల సహకారం తీసుకోండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల మెప్పు లభిస్తుంది.
మార్గశిరం: ఈ నెలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. కొత్త పరిచయాల వల్ల కలిసివస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు.
పుష్యం: పట్టుదలతో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి స్పందించండి. రుణ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
మాఘం: ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. బయటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండండి. సంఘంలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తుల సహకారంతో కొన్ని పనులు చక్కబడతాయి.
ఫాల్గుణం: శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆలస్యంగా అయినా రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అధికారులతో సత్సంబంధాలు కొనసాగించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
- గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. కేతువు అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేసుకోండి. తరచూ ఆదివారాలు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

