Ugadi Panchangam 2024 | ఈ రాశివారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే
ఈ రాశివారికి గురువు వ్యయంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా జన్మరాశిలో ఉంటాడు. రాజ్యంలో శని, లాభంలో రాహువు, పంచమంలో కేతువు సంచరిస్తారు. రాహువు, కేతువు అనుకూల ఫలితాలు ఇస్తారు. గురువు, శని మిశ్రమ ఫలితాలు ఇస్తారు. శివారాధన శుభప్రదం.
వృషభం కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయం: 2
వ్యయం: 8
రాజపూజ్యం: 7
అవమానం: 3
చైత్రం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.
వైశాఖం: ప్రారంభించిన పనులను ప్రణాళికా బద్ధంగా పూర్తిచేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. నలుగురికి సాయం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు.
జ్యేష్ఠం: ఆత్మీయులు, మిత్రుల సహకారం లభిస్తుంది. అయితే కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. శ్రద్ధతో పనులు చేయాలి. ఉద్యోగులకు తోటివారితో స్నేహం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పొందుతారు.
ఆషాఢం: వ్యాపారులు కొత్త లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. రావలసిన డబ్బు వస్తుంది.
శ్రావణం: వివాదాలకు దూరంగా ఉండండి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పనులు నెరవేరుతాయి.
భాద్రపదం: పనుల్లో ఆటంకాలు ఏర్పడినా సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలం. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.
ఆశ్వీయుజం: ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలను పొందుతారు. పూర్వం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
కార్తీకం: అనవసరమైన ప్రయాణాల వలన అలసట, వృథా ఖర్చులు ఉంటాయి. పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఫలవంతంగా ఉంటాయి. విద్యార్థులు శ్రమించి, ఫలితాలను పొందుతారు. బంధువర్గం, స్నేహితులతో పనులు నెరవేరినప్పటికీ, జాగ్రత్త అవసరం.
మార్గశిరం: ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పనిభారం పెరగడంతో అకాల భోజనం చేయాల్సి వస్తుంది. ఫలితంగా అనారోగ్య సూచన. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిర్మాణ పనులు చేపడతారు.
పుష్యం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో పనులు కలిసి వస్తాయి. వాహన, భూ లావాదేవీలు అనుకూలం. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంయమనంతో పనులు సాధిస్తారు.
మాఘం: నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు పనిచేసే చోట ఆదరణ పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు
ఫాల్గుణం: గతంలో నిలిచిపోయిన పనులు ప్రారంభిస్తారు. ప్రయాణాల మూలంగా అలసట, వృథా ఖర్చులు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.
- ఈ రాశివారికి గురువు వ్యయంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా జన్మరాశిలో ఉంటాడు. రాజ్యంలో శని, లాభంలో రాహువు, పంచమంలో కేతువు సంచరిస్తారు. రాహువు, కేతువు అనుకూల ఫలితాలు ఇస్తారు. గురువు, శని మిశ్రమ ఫలితాలు ఇస్తారు. శివారాధన శుభప్రదం.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

