Ugadi Panchangam 2023 | ఈ ఏడాది వృషభ రాశివారికి ఆదాయం బాగున్నా ఖర్చులు మాత్రం..
గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. దత్తాత్రేయస్వామి ఆరాధన వల్ల గురువు అనుగ్రహం పొందవచ్చు. తరచూ గురువారాలు మేడిచెట్టుకు ప్రదక్షిణలు చేయండి. శనివారం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి. శక్తిమేరకు బీదసాదలకు దానధర్మాలు చేయండి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఆదాయం: 14
వ్యయం: 11
రాజపూజ్యం: 6
అవమానం: 1
చైత్రం: ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తవుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. పై అధికారుల మెప్పు పొందుతారు.
వైశాఖం: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం బాగున్నా ఖర్చుల నియంత్రణ అవసరం. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. ప్రభుత్వ, కోర్టు వ్యవహారాల్లో అనుకూలం.
జ్యేష్ఠం: ఈ నెల అనుకూలం. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. కార్యసిద్ధి ఉంది. పెట్టుబడులకు అనుకూల సమయం.
ఆషాఢం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
అధిక-నిజ శ్రావణం: శ్రమ అధికం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఒప్పందాల విషయంలో ఏమరుపాటు తగదు. వ్యాపార భాగస్వాములతో వివాదాలకు దూరంగా ఉండండి. ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం.
భాద్రపదం: పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే ఖర్చులకు సరిపడా ఉండకపోవచ్చు. ఆరోగ్య సూత్రాలు పాటించండి. ఉద్యోగంలో ఒత్తిడికి లోనవుతారు. వివాదాల్లో తలదూర్చకండి.
ఆశ్వయుజం: ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని పనులు చేపట్టండి. బంధువులతో వైరం వద్దు. పిల్లల చదువు, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. క్రయవిక్రయాల్లో జాగ్రత్త.
కార్తికం: కొత్త అవకాశాలు వస్తాయి. నలుగురికీ ఉపయోగపడే పనులు చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. అయితే, ఆర్థికంగా సర్దుబాట్లు తప్పవు. విద్యార్థులకు మంచి కాలం.
మార్గశిరం: ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది.
పుష్యం: వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తిగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భూలావాదేవీల్లో జాగ్రత్త వహించండి.
మాఘం: కలహాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా ఫర్వాలేదు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. మంచివారితో స్నేహం వల్ల కలిసివస్తుంది.
ఫాల్గుణం: పనులు సకాలంలో పూర్తవుతాయి. పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.
- గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. దత్తాత్రేయస్వామి ఆరాధన వల్ల గురువు అనుగ్రహం పొందవచ్చు. తరచూ గురువారాలు మేడిచెట్టుకు ప్రదక్షిణలు చేయండి. శనివారం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి. శక్తిమేరకు బీదసాదలకు దానధర్మాలు చేయండి.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

