Ugadi Panchangam | వృశ్చికం రాశివారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు..
గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. దుర్గాదేవి ఆరాధన వల్ల రాహువు అనుగ్రహం పొందవచ్చు. శక్తిమేరకు బీదసాదలకు దానధర్మాలు చేయండి. తద్వారా శనైశ్చరుడి అనుగ్రహం సిద్ధిస్తుంది.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
ఆదాయం: 5
వ్యయం: 5
రాజపూజ్యం: 3
అవమానం: 3
చైత్రం: ఉత్సాహంగా పనులు చేస్తారు. ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం.
వైశాఖం: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. నలుగురిలో మాట చెల్లుబాటు అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి.
జ్యేష్ఠం: అనవసరమైన ఆలోచనలు పక్కనపెట్టి పనులపై మనసు నిలపండి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. పిల్లల చదువు, శుభకార్యాల విషయంలో సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
ఆషాఢం: ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వివాదాల్లోకి వెళ్లకుండా ఉండండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది.
అధిక-నిజ శ్రావణం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
భాద్రపదం: విశ్వాసంతో పనులు చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల అండదండలు లభిస్తాయి. పదోన్నతులు, స్థానచలన సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆర్థికంగా మంచి మార్పు వస్తుంది.
ఆశ్వయుజం: ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వయంశక్తితో పనులు పూర్తి చేసుకోవాలి. పనిభారం పెరగవచ్చు. అధికారుల ఆదరణ, సహోద్యోగుల సహకారం లభిస్తాయి. బంధువర్గంతో మనస్పర్ధలు రావచ్చు.
కార్తికం: ప్రతి విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మరాదు. వృథా ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. వాహన, భూముల విషయంలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి.
మార్గశిరం: ప్రారంభించిన పనులు శ్రద్ధగా పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల సమయం. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అన్నదమ్ములు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది.
పుష్యం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఆందోళనకు గురవుతారు. క్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది.
మాఘం: శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబంతో సఖ్యతగా ఉంటారు. ఓపిక చాలా అవసరం. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. ప్రజాప్రతినిధులకు మంచి సమయం.
ఫాల్గుణం: ప్రయాణాలు కలిసివస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మాట పలుకుబడి పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది.
- గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. దుర్గాదేవి ఆరాధన వల్ల రాహువు అనుగ్రహం పొందవచ్చు. శక్తిమేరకు బీదసాదలకు దానధర్మాలు చేయండి. తద్వారా శనైశ్చరుడి అనుగ్రహం సిద్ధిస్తుంది.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

