Ugadi Panchangam | ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి.. విద్యార్థులు చదువులో సత్ఫలితాలు సాధిస్తారు
గురువు, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. దత్తాత్రేయస్వామి ఆరాధన వల్ల గురు అనుగ్రహం పొందవచ్చు. తరచూ మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆదాయం: 8
వ్యయం: 11
రాజపూజ్యం: 6
అవమానం: 3
చైత్రం: ప్రారంభించిన పనులు శ్రద్ధగా పూర్తిచేస్తారు. డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రావలసిన సొమ్ము వివాదాలతో చేతికి అందుతుంది. కుటుంబంలో పెద్దల సహకారం లభిస్తుంది. వాహన మూలకంగా ధన వ్యయం.
వైశాఖం: వృత్తిలో సంతృప్తి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. స్నేహితులు, బంధువుల వల్ల పనులు నెరవేరుతాయి. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. విద్యార్థులు చదువులో సత్ఫలితాలు సాధిస్తారు.
జ్యేష్ఠం: అనవసరమైన వివాదాల జోలికి వెళ్లొద్దు. దూర ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగులు ఆఫీసులో సంయమనం పాటించడం అవసరం. ఖర్చులను నియంత్రించండి.
ఆషాఢం: ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. పట్టుదలతో ప్రయత్నించండి. వాహనాల వల్ల ధన వ్యయ సూచన. సంయమనంతో నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది.
అధిక-నిజ శ్రావణం: కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అన్నిటా విజయం పొందుతారు.
భాద్రపదం: ఆర్థికంగా కలిసివస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందడంతో రుణ బాధలు కొంతవరకు తీరుతాయి.
ఆశ్వయుజం: ఈ నెల సత్ఫలితాలు ఉన్నాయి. బంధువుల రాకతో ఖర్చు పెరిగినా, సంతోషం పొందుతారు. సమయానికి డబ్బు అందుతుంది. ఉద్యోగులకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.
కార్తికం: కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లొద్దు. ఆత్మీయుల తోడ్పాటుతో చాలా పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో సంతృప్తి. శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి.
మార్గశిరం: ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. బంధువులతో భేదాభిప్రాయాలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి.
పుష్యం: ప్రారంభించిన పనులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అవసరం. భార్యాపిల్లలతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. ఒప్పందాల విషయంలో సంయమనంతో వ్యవహరించండి.
మాఘం: బంధువర్గంతో వైషమ్యాలు తలెత్తవచ్చు. రావలసిన డబ్బు చేతికి అందినా, వృథా ఖర్చులు తగ్గించుకోవడం అవసరం. ప్రయాణాల వల్ల అలసట, వృథా కాలయాపన గోచరిస్తున్నది. విద్యార్థులకు మంచి కాలం.
ఫాల్గుణం: పనిభారం పెరిగినా సంయమనంతో వ్యవహరిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. భూలావాదేవీల్లో అనుకూలత ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల పనులు ఆలస్యం అవుతాయి.
- గురువు, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. దత్తాత్రేయస్వామి ఆరాధన వల్ల గురు అనుగ్రహం పొందవచ్చు. తరచూ మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

