Ugadi Panchangam | ఆదాయం స్థిరంగా ఉన్నా.. అనూహ్యంగా పెరుగనున్న ఖర్చులు
గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. ఆంజనేయస్వామి ఆరాధన వల్ల ఏల్నాటి శని ప్రభావం నుంచి బయటపడొచ్చు. శక్తిమేరకు బీదసాదలకు దానధర్మాలు చేయండి. గురువు అనుగ్రహం కోసం శివారాధన చేసుకోండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం: 8
వ్యయం: 11
రాజపూజ్యం: 1
అవమానం: 2
చైత్రం: ఆర్థిక పరిస్థితి పురోగతిలో ఉంటుంది. ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. స్నేహితులు, బంధువులతో విభేదాలు ఏర్పడవచ్చు. వాహనాల మూలంగా ఇబ్బందులు రావచ్చును. సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వైశాఖం: మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా పనులు నెరవేరుతాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వృత్తిలో అనుకూలత. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది.
జ్యేష్ఠం: సమయానుకూల నిర్ణయాలను తీసుకొని సత్ఫలితాలు పొందుతారు. పిల్లల చదువు విషయంలో కలిసి వస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
ఆషాఢం: వృత్తిలో పనివారి సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రుణాలు తీరుస్తారు. ఆదాయం మెరగవుతుంది. వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం.
అధిక-నిజ శ్రావణం: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనులు వాయిదా వేస్తారు.
భాద్రపదం: అనవసరమైన విషయాలలో తల దూర్చడంతో వివాదాలలో చిక్కుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉన్నా.. ఖర్చులు అనూహ్యంగా పెరగడం వల్ల సర్దుబాటు తప్పదు. వాహనాల మూలంగా ఖర్చులు. అనవసరమైన ప్రయాణాలతో అలసట కలుగుతుంది.
ఆశ్వయుజం: ప్రారంభించిన పనులను శ్రమతో పూర్తిచేస్తారు. అనాలోచిత పెట్టుబడుల మూలంగా ఇబ్బందులు ఎదురవుతాయి. సంయమనం అవసరం. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. భూములు, వాహనాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి.
కార్తికం: అధికారులతో సఖ్యత పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పనులను జాగ్రత్తగా పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. పిల్లల చదువు, ఉద్యోగం, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
మార్గశిరం: ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవతా, గురు భక్తి పెరుగుతుంది. ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు.
పుష్యం: ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు చేసే ఆలోచనలో ఉంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడటంతో నలుగురికి సాయపడే పనులను చేపడతారు.
మాఘం: ఆలోచనలను సమయానుకూలంగా ఆచరణలో పెడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి స్థాయిలో నిలుస్తారు.
ఫాల్గుణం: పనులు కొంత ఆలస్యంతో పూర్తవుతాయి. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. వివాదాల్లోకి వెళ్లకుండా పనిపై మనసు నిలపడం అవసరం.
- గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. ఆంజనేయస్వామి ఆరాధన వల్ల ఏల్నాటి శని ప్రభావం నుంచి బయటపడొచ్చు. శక్తిమేరకు బీదసాదలకు దానధర్మాలు చేయండి. గురువు అనుగ్రహం కోసం శివారాధన చేసుకోండి.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

