Ugadi Panchangam | ఈ రాశివారికి ఆదాయం స్థిరంగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి
గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. దత్తాత్రేయస్వామి ఆరాధన వల్ల గురువు అనుగ్రహం పొందవచ్చు. తరచూ మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
తుల రాశి (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆదాయం: 14
వ్యయం: 11
రాజపూజ్యం: 7
అవమానం: 3
చైత్రం: ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు. ఆదాయం స్థిరంగా ఉన్నా, ఖర్చులు పెరుగుతాయి. ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
వైశాఖం: వృత్తి, వ్యాపారాల్లో పనివారితో ఇబ్బందులు తలెత్తవచ్చు. పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆర్థికంగా సర్దుబాట్లు అవసరం కావొచ్చు. కొత్త నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది.
జ్యేష్ఠం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆలస్యమైనా చేపట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఉద్యోగంలో తోటివారి సహకారం లభిస్తుంది. భూలావాదేవీలు కొంత వరకు కలిసివస్తాయి.
ఆషాఢం: ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆటంకాలు ఎదురైనా అన్నిటా విజయం సాధిస్తారు. ఉద్యోగంలో సంతృప్తి లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కొత్త వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టం. జాగ్రత్త వహించండి.
అధిక-నిజ శ్రావణం: ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
భాద్రపదం: ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అందుకు తగ్గ గుర్తింపు కొరవడటంతో నిరాశకు గురవుతారు. కోర్టు వివాదాలు తలెత్తవచ్చు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
ఆశ్వయుజం: బంధువర్గంతో వైరం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అనవసర విషయాల్లో తలదూర్చొద్దు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ కూడదు. ఖర్చులు పెరుగుతాయి. మాసాంతంలో ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది.
కార్తికం: చేసే పనిలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. పై అధికారులతో సంయమనంతో వ్యవహరించండి.
మార్గశిరం: ఆదాయం బాగున్నా, ఖర్చులూ ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. అందరితో సామరస్యంగా ఉండండి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేయండి.
పుష్యం: స్నేహితుల సహకారం లభిస్తుంది. పనులు కలిసివస్తాయి. గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది.
మాఘం: సకాలంలో పనులు పూర్తిచేస్తారు. బాధ్యతగా నడుచుకుంటారు. కుటుంబ సహకారం లభిస్తుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ప్రయాణాలు కలిసివస్తాయి.
ఫాల్గుణం: ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. వృథా ఖర్చులు తగ్గించుకోండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం.
- గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. దత్తాత్రేయస్వామి ఆరాధన వల్ల గురువు అనుగ్రహం పొందవచ్చు. తరచూ మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

