Ugadi Panchangam | ఈ రాశివారికి స్థిర ఆదాయం.. సమాజంలో గౌరవ మర్యాదలు
గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. అష్టమ శని ప్రభావం తగ్గడానికి ఆంజనేయస్వామి ఆరాధన చేసుకోండి. అనాథ చిన్నారులు, దివ్యాంగులకు ఉన్నంతలో ఆర్థికంగా సహకారం అందించండి. దుర్గాదేవి ఆరాధన వల్ల రాహువు అనుగ్రహం కలుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఆదాయం: 14
వ్యయం: 2
రాజపూజ్యం: 1
అవమానం: 7
చైత్రం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు పొందుతారు. మానసికంగా సంతృప్తి చెందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి సమయం.
వైశాఖం: వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనిలో తృప్తి లభిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. స్నేహితులు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది.
జ్యేష్ఠం: ఈ నెల అనుకూలంగా ఉన్నా, అధిక శ్రమతో పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఊరట లభిస్తుంది. శుభకార్యాలు చేపడతారు.
ఆషాఢం: ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. పిల్లల చదువుల విషయంలో అనుకూలత ఉంటుంది. రుణబాధలు తీరుతాయి.
అధిక-నిజ శ్రావణం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర ఆలోచనలు కట్టిపెట్టండి.
భాద్రపదం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు.
ఆశ్వయుజం: ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి వ్యక్తుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరిగినా విజయం సాధిస్తారు.
కార్తికం: కొత్త పరిచయాలతో కార్యానుకూలత. శుభకార్యాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. తోటి ఉద్యోగులతో సఖ్యత పెరుగుతుంది.
మార్గశిరం: ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పనులు వాయిదా పడొచ్చు. ప్రయాణాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. మాసాంతంలో పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది.
పుష్యం: ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. విదేశీ ప్రయాణానికి అనుకూల సమయం.
మాఘం: మంచివ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పూర్వం కన్నా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
ఫాల్గుణం: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో స్థాన చలనం వల్ల సంతోషిస్తారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి.
- గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. అష్టమ శని ప్రభావం తగ్గడానికి ఆంజనేయస్వామి ఆరాధన చేసుకోండి. అనాథ చిన్నారులు, దివ్యాంగులకు ఉన్నంతలో ఆర్థికంగా సహకారం అందించండి. దుర్గాదేవి ఆరాధన వల్ల రాహువు అనుగ్రహం కలుగుతుంది.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

