Ugadi Panchangam 2023 | ఈ రాశివారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే
గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. దుర్గాదేవి ఆరాధన వల్ల రాహువు అనుగ్రహం పొందవచ్చు. తరచూ ఆదివారాలు అమ్మవారి ఆలయాన్ని సందర్శించండి. శనివారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లండి.
మిథునం (మృగశిర 3,4 ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఆదాయం: 2
వ్యయం: 11
రాజపూజ్యం: 2
అవమానం: 4
చైత్రం: అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అందరి సహకారంతో పనులు పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులతో స్నేహభావంతో మెలగండి. వ్యాపారులకు భాగస్వాముల వల్ల ఇబ్బందులు.
వైశాఖం: ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
జ్యేష్ఠం: గత నెలతో పోలిస్తే అనుకూలంగా ఉంటుంది. పని విధానంలో మార్పులు అవసరం. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వృథా కాలయాపన చేస్తారు. వాహనాల మూలంగా డబ్బు ఖర్చు. బంధువులతో కొన్ని పనులు నెరవేరుతాయి.
ఆషాఢం: ఎంచుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
అధిక-నిజ శ్రావణం: కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు, వినోదాలకు హాజరవుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
భాద్రపదం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. బంధువుల రాకతో ఖర్చులు పెరుగవచ్చు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు పని పెరిగినా, అధికారుల ఆదరణ లభిస్తుంది.
ఆశ్వయుజం: ప్రతికూల ఫలితాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చుల కారణంగా డబ్బుకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఒప్పందాల విషయంలో ఏమరుపాటు తగదు.
కార్తికం: నెల ప్రారంభంలో ఇబ్బందులున్నా క్రమేపీ అనుకూలంగా మారుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
మార్గశిరం: ఆర్థిక పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. పిల్లల చదువులు, విదేశీ ప్రయాణాల విషయంలో అనుకూల ఫలితాలు రావచ్చు. అధికారుల మెప్పు పొందుతారు.
పుష్యం: నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల చదువు ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పనివారితో కలహ సూచన. భూ, వాహన లావాదేవీల్లో జాగ్రత్త అవసరం.
మాఘం: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. గృహోపకరణాలు కొనుగోలు చేయవచ్చు. వృథా ఖర్చుల కారణంగా సర్దుబాట్లు అవసరం అవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం.
ఫాల్గుణం: ఆహార నియమాలు పాటించాలి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వృత్తివ్యాపారాల్లో లాభాలున్నా ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే కోరుకున్న ఫలితం సిద్ధిస్తుంది.
- గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. దుర్గాదేవి ఆరాధన వల్ల రాహువు అనుగ్రహం పొందవచ్చు. తరచూ ఆదివారాలు అమ్మవారి ఆలయాన్ని సందర్శించండి. శనివారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లండి.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

