Ugadi Panchangam | శోభకృత్ నామ సంవత్సరంలో మకర రాశివారికి ఎలా ఉంటుందంటే..
గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. ఆంజనేయస్వామి ఆరాధన వల్ల ఏల్నాటి శని ప్రభావం నుంచి బయటపడొచ్చు. శక్తిమేరకు బీదసాదలకు దానధర్మాలు చేయండి. శివారాధన వల్ల గురువు అనుగ్రహం సిద్ధిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు)
ఆదాయం: 11
వ్యయం: 5
రాజపూజ్యం: 2
అవమానం: 6
చైత్రం: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఉద్యోగులకు
మంచి కాలం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారం బాగున్నా, వినియోగదారులతో ఇబ్బందులు ఉండవచ్చు.
వైశాఖం: ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. వృత్తిలో సంతృప్తి పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు.
జ్యేష్ఠం: శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వాహనాలు, భూలావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉన్నా.. అనుకోని ఖర్చులు తప్పవు.
ఆషాఢం: అనవసరమైన విషయాల వల్ల ఆందోళన చెందుతారు. మిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. ఒప్పందాలు కలిసివస్తాయి. ప్రయాణాల వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి. స్వశక్తిని నమ్ముకోండి.
అధిక-నిజ శ్రావణం: ప్రారంభించిన పనులు సంయమనంతో పూర్తి చేయాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. భూలావాదేవీల నిర్ణయాల్లో తొందరపాటు తగదు.
భాద్రపదం: స్నేహితులు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మంచి పనుల కోసం డబ్బు ఖర్చవుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం.
ఆశ్వయుజం: వృథా ఖర్చుల వల్ల ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. సర్దుబాట్లు చేసుకోవాల్సి రావచ్చు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. గృహ నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి.
కార్తికం: ఉద్యోగులు సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులున్నా ఆ ప్రభావం ఉండదు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
మార్గశిరం: ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. కొత్త పనులు తలపెడతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
పుష్యం: ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దలతో అభిప్రాయ భేదాలు రావచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.
మాఘం: ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించండి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. అనవసరమైన ఖర్చుల వల్ల ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి రావచ్చు. ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతారు.
ఫాల్గుణం: ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించుకోవాలి. నియంత్రణపై మనసు నిలపాలి. పని భారం పెరుగుతుంది. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
- గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. ఆంజనేయస్వామి ఆరాధన వల్ల ఏల్నాటి శని ప్రభావం నుంచి బయటపడొచ్చు. శక్తిమేరకు బీదసాదలకు దానధర్మాలు చేయండి. శివారాధన వల్ల గురువు అనుగ్రహం సిద్ధిస్తుంది.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

