Ugadi Panchangam | శోభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి ఆదాయం 11.. అవమానం..
గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. ఆంజనేయస్వామి ఆరాధన వల్ల శని అనుగ్రహం పొందవచ్చు. శక్తిమేరకు బీదసాదలకు దానధర్మాలు చేయండి. శివారాధన వల్ల గురువు అనుగ్రహం సిద్ధిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం: 11
వ్యయం: 8
రాజపూజ్యం: 5
అవమానం: 4
చైత్రం: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఓపిక, శ్రద్ధతో చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. అనవసరమైన విషయాలను స్నేహితులతో చర్చించకుండా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు.
వైశాఖం: అన్ని రంగాల్లో విజయం లభిస్తుంది. అందరితో స్నేహపూర్వకంగా మెలగుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. శుభకార్యాల్లో పాలుపంచుకుంటారు.
జ్యేష్ఠం: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నియమాలకు లోబడి కార్యాలు నెరవేరుస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి.
ఆషాఢం: అన్ని విషయాల్లో పట్టుదలతో వ్యవహరిస్తారు. అత్యవసర పనులకు ప్రాధాన్యమిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. ప్రజాప్రతినిధులు సత్ఫలితాలు సాధిస్తారు.
అధిక-నిజ శ్రావణం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. విద్యార్థులు ఏకాగ్రతతో విజయం సాధిస్తారు.
భాద్రపదం: ఆటంకాలను అధిగమించి అన్నిటా విజయం సాధిస్తారు. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆశ్వయుజం: నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంది. అధికారుల మెప్పు లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి.
కార్తికం: ఈ నెల అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. వ్యాపారంలో పురోభివృద్ధి సాధిస్తారు. కార్యసాఫల్యం ఉంది. కొత్త పనులు చేపడుతారు. వివాదాలకు దూరంగా ఉంటారు.
మార్గశిరం: వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు ఉన్నా, అంతిమంగా అనుకూల ఫలితాలు పొందుతారు. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
పుష్యం: శ్రమ అధికంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆదాయంలో ఒడుదొడుకులు ఎదురవ్వొచ్చు.
మాఘం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవసేవ చేసుకుంటారు.
ఫాల్గుణం: ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు ధైర్యంగా పూర్తిచేస్తారు. వ్యాపార ఒప్పందాల్లో ఏమరుపాటు తగదు. విద్యార్థులు ఏకాగ్రతతో విజయం సాధిస్తారు.
- గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. ఆంజనేయస్వామి ఆరాధన వల్ల శని అనుగ్రహం పొందవచ్చు. శక్తిమేరకు బీదసాదలకు దానధర్మాలు చేయండి. శివారాధన వల్ల గురువు అనుగ్రహం సిద్ధిస్తుంది.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

