Ugadi Panchangam 2023 | శోభకృత్ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే..
పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. రావాల్సిన సొమ్ము వచ్చినా, అనుకోని ఖర్చులు ముందుకురావొచ్చు. వాహనాల మూలంగా ఖర్చులు ఏర్పడవచ్చు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరించండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆదాయం: 5
వ్యయం: 5
రాజపూజ్యం: 3
అవమానం: 1

చైత్రం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలం. ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. స్నేహితులు, బంధువుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు.
వైశాఖం: వృత్తి, వ్యాపారాల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కొత్త పరిచయాల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. కొత్త ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు.
జ్యేష్ఠం: ఈ నెలలో సూర్య సంచారం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు లభిస్తుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి.
ఆషాఢం: పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. రావాల్సిన సొమ్ము వచ్చినా, అనుకోని ఖర్చులు ముందుకురావొచ్చు. వాహనాల మూలంగా ఖర్చులు ఏర్పడవచ్చు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరించండి.
అధిక-నిజ శ్రావణం: మంచి ఆలోచనలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప చికాకులు ఎదురైనా ఆలస్యంగా అయినా వాటిని అధిగమిస్తారు. పై అధికారులతో మనస్పర్ధలు రావొచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
భాద్రపదం: ఉత్సాహంతో ఉంటారు. పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. దూర ప్రయాణాల వల్ల కలిసివస్తుంది.
ఆశ్వయుజం: స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. నెల ద్వితీయార్ధంలో పనిభారం పెరగవచ్చు. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. సర్దుబాట్లు అవసరం పడతాయి. ఆరోగ్య సూత్రాలు పాటించండి.
కార్తికం: ఈ నెలలో శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదురవ్వొచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరగవచ్చు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది.
మార్గశిరం: ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమయానికి తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళితే సమస్యలను అధిగమిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. స్నేహితుల సహకారం లభిస్తుంది.
పుష్యం: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది.
మాఘం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్వయం ఉపాధిలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లకు అవకాశం. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఫాల్గుణం: సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు పొందుతారు. పిల్లల చదువు, ఉద్యోగం, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
- గురువు, రాహువు, కేతువు అనుగ్రహం కోసం ఆయా గ్రహాలకు జప, క్షీర తర్పణ, హోమ దానాదులు నిర్వహించండి. రుద్రాభిషేకం చేయించండి. ప్రతిరోజూ దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. అప్పుడప్పుడూ మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లండి.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

