Ugadi Panchangam | కుంభ రాశివారికి గురుభక్తి పెరుగుతుంది.. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం
గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. ఆంజనేయస్వామి ఆరాధన వల్ల ఏల్నాటి శని ప్రభావం నుంచి బయటపడొచ్చు. శక్తిమేరకు బీదసాదలకు దానధర్మాలు చేయండి. దుర్గాదేవి ఆరాధన వల్ల రాహువు అనుగ్రహం సిద్ధిస్తుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆదాయం: 11
వ్యయం: 5
రాజపూజ్యం: 5
అవమానం: 6
చైత్రం: ఆటంకాలు ఎదురైనా ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురైనా తెలివిగా వాటిని అధిగమిస్తారు.
వైశాఖం: ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. కానీ, రాబడికి మించి ఖర్చులు ఉండటంతో ఆందోళన చెందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి.
జ్యేష్ఠం: ప్రయత్నపూర్వకంగా పనులు చక్కబెడతారు. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. సరదాలకు ఎక్కువగా వెచ్చిస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి.
ఆషాఢం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గురుభక్తి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యాపార విస్తరణ ఆలోచన కొంతకాలం వాయిదా వేయండి.
అధిక-నిజ శ్రావణం: భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. పిల్లల చదువు, వివాహం, ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం.
భాద్రపదం: రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఫలితంగా చేయవలసిన ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి రావచ్చు. అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. సహోద్యోగులతో సఖ్యత అవసరం. మానసిక ఒత్తిళ్లు ఉంటాయి.
ఆశ్వయుజం: కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో అనుకున్నవి సాధిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం.
కార్తికం: మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. వాటిని సమయానుకూలంగా అమలు చేయడం అవసరం. వ్యాపారం సంతృప్తిగా ఉంటుంది. భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు రావచ్చును. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండాలి.
మార్గశిరం: ప్రారంభించిన పనులను అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. శుభకార్యాల విషయంలో నలుగురి సహకారం లభిస్తుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. గౌరవ మర్యాదలు పొందుతారు.
పుష్యం: ప్రారంభించిన పనులను శ్రద్ధతో, జాగ్రత్తగా పూర్తిచేస్తారు. రావలసిన డబ్బు అందుతుంది. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అయితే, కొత్త పనులను కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది.
మాఘం: సంఘంలో మంచి వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. భూలావాదేవీలో ఇబ్బందులు ఏర్పడవచ్చు.
ఫాల్గుణం: ఉద్యోగులకు అధికారుల నుంచి విమర్శలు ఎదురవ్వొచ్చు. అనవసరమైన ఖర్చులు ముందుకువస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత, పట్టుదల అవసరం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రుణబాధలు కొంత వరకు తీరుతాయి.
- గురువు, శని, రాహు, కేతు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయండి. ఆంజనేయస్వామి ఆరాధన వల్ల ఏల్నాటి శని ప్రభావం నుంచి బయటపడొచ్చు. శక్తిమేరకు బీదసాదలకు దానధర్మాలు చేయండి. దుర్గాదేవి ఆరాధన వల్ల రాహువు అనుగ్రహం సిద్ధిస్తుంది.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

